మొత్తం నియామకాలు నెమ్మదించినా సీనియర్ల ఎగ్జిక్యూటివ్‌లకు తగ్గని గిరాకీ!

by Disha Web Desk 17 |
మొత్తం నియామకాలు నెమ్మదించినా సీనియర్ల ఎగ్జిక్యూటివ్‌లకు తగ్గని గిరాకీ!
X

న్యూఢిల్లీ: గత కొంతకాలంగా దేశీయ కంపెనీలు మొత్తం నియామకాలను తగ్గించాయి. అయితే, సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల విషయంలో మాత్రమే ఈ ధోరణి భిన్నంగా ఉందని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. ఇటీవల ఓ నివేదిక ప్రకారం, గత త్రైమాసికంలో నియామకాలు తగ్గినప్పటికీ సీనియర్-స్థాయి ఉద్యోగుల నియామకాలు ఫ్లాట్‌గా నమోదయ్యాయి.

కరోనా మహమ్మారి తర్వాత గత ఏడాది డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో వ్యాపారాలు గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 25 శాతం పెరిగాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. డిమాండ్‌ను తీర్చే స్థాయిలో అనుభవం ఉన్న సీనియర్ ఉద్యోగుల అవసరం పెరిగింది.

ముఖ్యంగా పారిశ్రామిక, ఉత్పాదక రంగాలు, ఆటో, కెమికల్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎనర్జీ కంపెనీల్లో చీఫ్ ఎక్స్‌పీరియన్స్ ఆఫీసర్(సీఎక్స్ఓ)లకు డిమాండ్ అత్యధికంగా ఉంది. సెప్టెంబర్ త్రైమాసికంలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులకు డిమాండ్ అత్యధికంగా నమోదైందని ఏబీసీ కన్సల్టెంట్ ఎండీ శివ్ అగర్వాల్ అన్నారు.

ప్రధానంగా ఇటీవల ఆర్థిక మాంద్యం భయాలు అధికం కావడంతో వ్యాపారాలను డిజిటలైజ్ చేసేందుకు కంపెనీలు సీనియర్ ఉద్యోగుల వెంట పడుతున్నాయని, మరోవైపు కొన్ని కంపెనీలు విస్తరణ ప్రణాళికలో భాగంగా సీనియర్లను ఎంచుకుంటున్నాయని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి.



Next Story

Most Viewed