కస్టమర్లకు షాక్....ప్లాట్‌ఫామ్ ఫీజు పెంచిన జొమాటో

by Dishanational1 |
కస్టమర్లకు షాక్....ప్లాట్‌ఫామ్ ఫీజు పెంచిన జొమాటో
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో కస్టమర్లకు షాక్ ఇచ్చింది. ప్లాట్‌ఫామ్ ఫీజును 25 శాతం పెంచుతూ తాజాగా కంపెనీ నిర్ణయం తీసుకుంది. కంపెనీ అధికారిక యాప్‌లో సమాచారం ప్రకారం, ఏప్రిల్ 20 నుంచి ఒక్కో ఆర్డర్‌పై రూ. 5 వసూలు చేయడం ప్రారంభించింది. ఢిల్లీ ఎన్‌సీఆర్, హైదరాబాద్, బెంగళూరు, ముంబై, లక్నో సహా కీలక నగరాల్లో జొమాటో ఆర్డర్లపై ప్లాట్‌ఫామ్ ఫీజును పెంచింది. ఇదివరకు జనవరి 1న జొమాటో కస్టమర్ల ప్లాట్‌ఫామ్ ఫీజును రూ. 3 నుంచి రూ. 4కి పెంచిన సంగతి తెలిసిందే. ఐదు నెలలు గడవకముందే మరో రూపాయి పెంచడం ద్వారా వినియోగదారులపై భారం మోపింది. నివేదికల ప్రకారం, జొమాటో ప్రతి రోజూ 20-22 లక్షల ఆర్డర్లను తీసుకుంటోంది. ఈ భారీ ఆర్డర్లపై రూ. 1 పెంచడం ద్వారా కంపెనీ తన ఆదాయంలో గణనీయమైన పెరుగుదలను చూడనుంది. జొమాటో పోటీ కంపెనీ స్విగ్గీ సైతం ఫుడ్ డెలివరీ ఆర్డర్లపై రూ. 5 ప్లాట్‌ఫామ్ ఫీజును వసూలు చేస్తోంది. జొమాటో కంపెనీ మొదటిసారిగా 2023, ఆగష్టులో ఆర్డర్లపై రూ. 2 చొప్పున ఫీజును వసూలు చేయడం ప్రారంభించింది. జొమాటో అనుబంధ క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ బ్లింక్ఇట్ ప్రతి ఆర్డర్‌పై రూ. 2 హ్యాండ్లింగ్ ఛార్జీని అమలు చేస్తోంది.



Next Story

Most Viewed