కొత్త పన్ను విధానం మధ్యతరగతి ప్రజలకు మేలు చేస్తుంది: నిర్మలా సీతారామన్

by Disha Web Desk 17 |
కొత్త పన్ను విధానం మధ్యతరగతి ప్రజలకు మేలు చేస్తుంది: నిర్మలా సీతారామన్
X

న్యూఢిల్లీ: ఇటీవల తీసుకొచ్చిన కొత్త పన్ను విధానం మధ్యతరగతి ప్రజలకు మేలు చేస్తుందని, దీని ద్వారా వారి చేతుల్లో ఎక్కువ డబ్బు మిగులుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. బడ్జెట్ అనంతరం ఆర్‌బీఐతో నిర్వహించిన సమావేశం తరువాత విలేకరులతో మాట్లాడిన ఆమె, ప్రజలు ప్రభుత్వ పథకాల్లోనే పెట్టుబడులు పెట్టాలని కోరడం లేదని, పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలను స్వేచ్చగా తీసుకునే అవకాశం వారికి ఇవ్వాలని అన్నారు.

అలాగే, అదానీ గ్రూప్ వివాదంపై మాట్లాడుతూ.. భారత మార్కెట్ నియంత్రణ రెగ్యులేటర్లలో చాలా అనుభవజ్ఞులైన నిపుణులు ఉన్నారు. ఈ సమస్యను వారు చూసుకుంటారని అన్నారు. అలాగే క్రిప్టో కరెన్సీకి సంబంధించి ఉమ్మడి ఫ్రేమ్‌వర్క్ రూపకల్పన కోసం G20 దేశాలతో చర్చలు జరుపుతున్నట్లు ఆమె చెప్పారు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ, ముడి చమురు ధరలు స్థిరంగా కొనసాగినట్లయితే సెంట్రల్ బ్యాంక్ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (సీపీఐ) ద్రవ్యోల్బణం 2023-24లో సగటున 5.3 శాతంగా ఉండే అవకాశం ఉందని అన్నారు. చమురు ధరలు తగ్గినట్లయితే ఆ ప్రయోజనం వివిధ వస్తువుల ధరలు తగ్గడంలో కనిపించడంతో పాటు, ద్రవ్యోల్బణం తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు.



Next Story

Most Viewed