భారత్‌లో ఏసీల తయారీ ప్లాంట్ ఏర్పాటుకు మిత్సుబిషి భారీ పెట్టుబడి!

by Disha Web Desk 17 |
భారత్‌లో ఏసీల తయారీ ప్లాంట్ ఏర్పాటుకు మిత్సుబిషి భారీ పెట్టుబడి!
X

చెన్నై: ప్రముఖ గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీ కంపెనీ మిత్సుబిషి ఎలక్ట్రిక్ ఇండియా దేశీయంగా ఏసీలు, కంప్రెషర్ల తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. దానికోసం సుమారు రూ. 1,820 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. చెన్నైలోని మహీంద్రా వరల్డ్ సిటీ డెవలపర్స్ ఇండస్ట్రియల్ పార్కులో 99 ఏళ్లకు లీజుకు తీసుకున్న స్థలంలో తయారీ ప్లాంట్ నిర్మించనుంది. అందులో ఏడాదికి 3 లక్షల యూనిట్ల ఏసీలు, 6.5 లక్షల యూనిట్ల కంప్రెషర్ల ఉత్పత్తిని చేపట్టనున్నట్టు కంపెనీ వెల్లడించింది.

భారత్‌లో పెరుగుతున్న ఏసీల డిమాండ్‌ను తీర్చేందుకు ఈ ప్లాంటు ఉత్పత్తి ఎంతో దోహదపడుతుందని, 2025 ద్వితీయార్థం నాటికి కార్యకలాపాలను ప్రారంభించనున్నట్టు మహీంద్రా లైఫ్ స్పేస్ డెవలపర్స్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేర్కొంది. కొత్త తయారీ ప్లాంట్ ద్వారా దేశీయ గిరాకీకి అనుగుణంగా ఉత్పత్తుల సరఫరా అందించేందుకు వీలవుతుందని మిత్సుబిషి ఎలక్ట్రిక్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కజుహికో తమురా అన్నారు.



Next Story

Most Viewed