రూ. 1.50 లక్షల వరకు డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించిన మారుతీ సుజుకి

by Gopi |
రూ. 1.50 లక్షల వరకు డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించిన మారుతీ సుజుకి
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ అతిపెద్ద ప్యాసింజర్ కార్ల కంపెనీ మారుతీ సుకుకి కొత్త ఆర్థిక సంవత్సరం సందర్భంగా భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. వివిధ మోడళ్లపై రూ. 1.50 లక్షల వరకు భారీ తగ్గింపు ఇస్తున్నట్టు బుధవారం తెలిపింది. ఈ తగ్గింపు నగదు, ఎక్స్‌ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ల రూపంలో ఉంటాయని పేర్కొంది. ప్రాంతం, వాహన వేరియంట్, ట్రిమ్‌లను బట్టి డిస్కౌంట్లలో మార్పులు ఉంటాయని కంపెనీ స్పష్టం చేసింది. కంపెనీ వివరాల ప్రకారం, మారుతీ సుజుకి ఇగ్నిస్ మోడల్‌పై రూ. 58,000 వరకు తగ్గింపును కంపెనీ అందిస్తోంది. ఇందులో రూ. 40 వేల క్యాష్ డిస్కౌంట్ కాగా, రూ. 15,000 ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ తగ్గింపు రూ. 3,000 వరకు ఉంది. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బలెనో మోడల్‌పై రూ. 35 వేల వరకు నగదు తగ్గింపు, రూ. 15 వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 3 వేల వరకు కార్పొరేట్ తగ్గింపు ఉంది. సీఎన్‌జీ వేరియంట్లపై నగదు తగ్గింపు రూ. 15 వేల మాత్రమే ఉండనుంది. సియాజ్ మోడల్‌పై అన్నీ కలుపులు రూ. 53,000 వరకు, గ్రాంట్ విటారా మోడల్‌పై రూ. 58,000 వరకు, స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్లపై రూ. 84,000 వరకు ప్రయోజనాలు పొందవచ్చు. ఫ్రాంక్స్ మోడల్‌పై రూ. 68,000 వరకు, జిమ్నీ మోడల్‌పైనా అత్యధిక మొత్తంలో నగదు డిస్కౌంట్లు ఉంటాయని కంపెనీ వెల్లడించింది.

Next Story