ఎస్‌యూవీ విభాగంలో రెట్టింపు అమ్మకాల లక్ష్యం: మారుతీ సుజుకి!

by Disha Web Desk 13 |
ఎస్‌యూవీ విభాగంలో రెట్టింపు అమ్మకాల లక్ష్యం: మారుతీ సుజుకి!
X

న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి వాహన మార్కెట్లో పట్టు కోసం మరింత దూకుడుగా వ్యవహరించాలని భావిస్తోంది. దాని కోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తన ఎస్‌యూవీ విభాగం అమ్మకాలను రెట్టింపు చేయాలనే లక్ష్యంతో ఉంది. ప్రస్తుతానికి మొత్తం వాహన మార్కెట్లో అత్యంత వేగవంతమైన వృద్ధితో 25 శాతం వాటా కలిగిన ఎస్‌యూవీ విభాగంలో లీడర్‌షిప్ స్థానాన్ని అందుకోవాలని భావిస్తున్నట్టు కంపెనీ సేల్స్ అండ్ మార్కెటింగ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ చెప్పారు.

ప్రస్తుతం మారుతీ సుజుకి గత ఆర్థిక సంవత్సరంలో 13 శాతం మార్కెట్ వాటాతో 2.02 లక్షల ఎస్‌యూవీలను విక్రయించింది. 2023-24లో 5 లక్షల యూనిట్ల వరకు ఎస్‌యూవీలను అమ్మాలని లక్ష్యం ఉంది. 2018లో మొత్తం వాహన పరిశ్రమలో ఎస్‌యూవీల వాటా 24 శాతం ఉండగా, 2022 నాటికి 43 శాతానికి పెరిగింది. ప్రస్తుతం వేగంగా పెరుగుతున్న ఎస్‌యూవీ మార్కెట్ వాటాను రెట్టింపు చేసుకోవడం ద్వారా మొత్తం ప్యాసింజర్ పరిశ్రమలో 50 శాతం వాటా సాధించేందుకు వీలవుతుందని కంపెనీ పేర్కొంది.

Also Read..

దాదాపు రూ. 38 వేల కోట్ల విలువైన నిధులను వెనక్కి తీసుకున్న ఎఫ్‌పీఐలు!

Next Story

Most Viewed