రెండోసారి ఆల్‌టైమ్ రికార్డు స్థాయికి జీఎస్టీ వసూళ్లు

by Disha Web Desk 17 |
రెండోసారి ఆల్‌టైమ్ రికార్డు స్థాయికి జీఎస్టీ వసూళ్లు
X

న్యూఢిల్లీ: భారత వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)కి సంబంధించి మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మార్చి నెలలో రికార్డు స్థాయిలో రూ.1.60 లక్షల కోట్లు వసూలైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించింది. ఇది గత ఏడాది మార్చి నెలతో పోలిస్తే 13% ఎక్కువ. జీఎస్టీని ప్రవేశపెట్టినప్పటి నుంచి వసూళ్లు రూ.1.60 లక్షల కోట్లకు పైగా నమోదు కావడం ఇది రెండోసారి. అలాగే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల కోట్లను దాటడం ఇది నాల్గవసారి.

ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం విడుదల చేసిన నివేదిక ప్రకారం.. మొత్తం మార్చి 2023 నెలలో స్థూల జీఎస్టీ ఆదాయం రూ. 1,60,122 కోట్లుగా నమోదైంది. ఇందులో సీజీఎస్టీ రూ. 29,546 కోట్లు, ఎస్‌జీఎస్టీ రూ. 37,314 కోట్లు, ఐజీఎస్టీ రూ. 82,907 కోట్లుగా ఉంది. ఈ సారి ఐజీఎస్టీ ఎన్నడు లేనంతగా ఎక్కువ స్థాయిలో వసూలైంది. వస్తువుల దిగుమతిపై వసూలు చేసిన పన్నులు కలిపి సెస్ ఆదాయం రూ.10,355 కోట్లుగా నమోదైందని మంత్రిత్వ శాఖ తెలిపింది.

మార్చి 2023లో దాఖలు చేసిన రిటర్న్‌లు కూడా గతంలో ఎన్నడూ లేనంత ఎక్కువగా ఉన్నాయి. మొత్తంగా 2022-23 లో రూ.18.10 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైంది. అంటే ఏడాది ప్రాతిపదికన సగటు నెలవారీ వసూళ్లు రూ.1.51 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఇది గత ఏడాదితో పోలిస్తే 22 శాతం ఎక్కువ. మార్చి 2023 నెలలో, వస్తువుల దిగుమతుల ద్వారా వచ్చే ఆదాయం 8% ఎక్కువగా ఉంది. దేశీయ లావాదేవీల ద్వారా వచ్చే ఆదాయం 14 శాతం ఎక్కువగా నమోదైంది.

Also Read..

ఈ రోజు నుంచి కొత్త రూల్స్..



Next Story

Most Viewed