ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో మరింత దూకుడు పెంచిన మహీంద్రా!

by Disha Web Desk 17 |
ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో మరింత దూకుడు పెంచిన మహీంద్రా!
X

న్యూఢిల్లీ: దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ మహీంద్రా భారత్‌లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో మరింత దూకుడుగా వ్యవహరించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే సోమవారం తన కొత్త అత్యాధునిక ఇంగ్లో ఈవీ ప్లాట్‌ఫామ్‌తో పాటు రెండు ఎలక్ట్రిక్ వాహనాల బ్రాండ్ కింద ఐదు ఈ-ఎస్‌యూవీ మోడళ్లను ఆవిష్కరించింది.

వీటిని మహీంద్రా అడ్వాన్స్‌డ్ డిజైన్ యూరప్ (మేడ్) సెంటర్‌లో రూపొందించింది. బ్రాండ్, డిజైన్, టెక్నాలజీ వ్యూహంతో అత్యాధునిక టెక్నాలజీ ఆధారంగా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను భారత మార్కెట్లో తీసుకురానున్నట్టు కంపెనీ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేర్కొంది.

ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలలో ప్రత్యేకతను లక్ష్యంగా పెట్టుకున్న మహీంద్రా, కంపెనీ ఈవీ పోర్ట్‌ఫోలియోలో ట్విన్ పీక్ లోగోతో బ్రాండ్ ఎక్స్‌యూవీ, బీఈ అనే కొత్త ఈవీ బ్రాండ్‌ను తీసుకొచ్చింది. కొత్త బ్రాండ్ల కింద ఎక్స్‌యూవీ ఈ8, ఎక్స్‌యూవీ ఈ9, బీఈ 05, బీఈ 07, బీఈ09 పేర్లతో ఐదు ఈ-ఎస్‌యూవీలను ప్రారంభించింది. వీటిని 2024-2026 మధ్య మార్కెట్లోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది.

ఓలా ఎలక్ట్రిక్ కార్ ఇండియాలో అందుబాటులోకి వచ్చేది అప్పుడే

Next Story

Most Viewed