IIT ఇండోర్‌తో ఒప్పందం కుదుర్చుకున్న L&T

by Disha Web Desk 17 |
IIT ఇండోర్‌తో ఒప్పందం కుదుర్చుకున్న L&T
X

ఇండోర్‌: పునరుత్పాదక ఇంధన నిర్వహణ, సాంకేతికత అంశాలలో పరిశోధన, అభివృద్ధి ప్రాజెక్టులను సంయుక్తంగా చేపట్టేందుకు IIT ఇండోర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇంజనీరింగ్ కంపెనీ లార్సెన్ అండ్ టూబ్రో (L&T) శనివారం తెలిపింది. కంపెనీకి చెందిన డిజిటల్ ఎనర్జీ సొల్యూషన్స్ విభాగం, IIT అధికారులు ఈ ఒప్పందంపై సంతకం చేశారు. ప్రస్తుతం చాలా కంపెనీలు పునరుత్పాదక ఇంధన అంశాలపై భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. దిగ్గజ కంపెనీలు అన్ని కూడా వివిధ ప్రతిష్టాత్మక విద్యా సంస్థలతో డీల్ కుదర్చుకుని కంపెనీకి అవసరమైన సాంకేతికతను అభివృద్ధి చేయడంతో పాటు, ఇంధన నిర్వహణ, సాఫ్ట్‌వేర్ వంటి రంగాలలో సమస్యల పరిష్కారంతో పాటు, కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాయి.



Next Story

Most Viewed