అదానీ కంపెనీల్లో వాటా పెంచిన LIC!

by Disha Web Desk 17 |
అదానీ కంపెనీల్లో వాటా పెంచిన LIC!
X

ముంబై: హిండెన్‌బర్గ్ నివేదిక కారణంగా భారీగా పతనమైన అదానీ గ్రూప్ కంపెనీ షేర్లలో ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ తన పెట్టుబడుల విలువను కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా అదానీ కంపెనీల్లో ఎల్ఐసీ పెట్టుబడులు మరింత పెరిగినట్టు తెలుస్తోంది. ఈ ఏడాది మార్చి త్రైమాసికంలో పలు మ్యూచువల్ ఫండ్ సంస్థలు అదానీ కంపెనీల్లో వాటాను తగ్గించుకున్న సమయంలో ఎల్ఐసీ తన వాటాను స్వల్పంగా పెంచుకుంది.

స్టాక్ ఎక్స్ఛేంజ్ సమాచారం ప్రకారం, అదానీ గ్రూపులోని నాలుగు కంపెనీల్లో వాటాలను పెంచుకోగా, రెండు కంపెనీల్లో తగ్గించింది. వాటిలో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో ఎల్ఐసీ వాటా 4.23 శాతం నుంచి 4.26 శాతానికి, అదానీ గ్రీన్ ఎనర్జీలో 1.28 శాతం నుంచి 1.36 శాతానికి, అదానీ టోటల్ గ్యాస్‌లో 5.96 శాతం నుంచి 6.02 శాతానికి, అదానీ ట్రాన్స్‌మిషన్‌లో 3.65 శాతం నుంచి 3.68 శాతానికి ఎల్ఐసీ వాటాలు పెరిగాయి.

ఇక, అదానీ పోర్ట్స్‌లో 9.14 శాతం నుంచి 9.12 శాతానికి, అంబుజా సిమెంట్స్‌లో 6.33 శాతం నుంచి 6.30 శాతానికి తగ్గింది. మిగిలిన కంపెనీల్లో ఎల్ఐసీ వాటాలు స్థిరంగా ఉన్నాయి.



Next Story