రుణ రేట్లను పెంచిన ఎల్ఐసీ హౌసింగ్(LIC HFL), బజాజ్ హౌసింగ్ (Bajaj Housing)ఫైనాన్స్ సంస్థలు!

by Disha Web Desk 17 |
రుణ రేట్లను పెంచిన ఎల్ఐసీ హౌసింగ్(LIC HFL), బజాజ్ హౌసింగ్ (Bajaj Housing)ఫైనాన్స్ సంస్థలు!
X

న్యూఢిల్లీ: ప్రముఖ ఎన్‌బీఎఫ్‌సీ సంస్థలు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ సోమవారం గృహ రుణాలపై వడ్డీ రేట్లను సవరిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఇరు సంస్థలు గృహ రుణాలపై 0.50 శాతం చొప్పున పెంచుతున్నట్టు ప్రకటించాయి. ఇటీవల ఆర్‌బీఐ అధిక ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు వరుస సమావేశాల్లో కీలక రెపో రేట్లను 1.40 శాతం పెంచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్యాంకులతో పాటు ఎన్‌బీఎఫ్‌సీ సంస్థలు సైతం అందుకనుగుణంగా రుణ రేట్లను సవరిస్తున్నాయి.

బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ 0.50 శాతం రుణాల రేట్లను పెంచడంతో వేతన జీవులు, వృత్తిపరమైన వారు తీసుకునే రుణాలపై 7.70 శాతం వడ్డీ అమలు కానుంది. అలాగే, ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ సైతం తన ప్రైమ్‌ లెండింగ్‌ రేటు (ఎల్‌హెచ్‌పీఎల్ఆర్) 0.50 శాతం పెంపు నిర్ణయం తీసుకోవడంతో గృహ రుణాలపై కొత్త వడ్డీ రేట్లు 7.50-8 శాతం నుంచి ప్రారంభం కానున్నాయి.

Next Story

Most Viewed