ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలను నమోదుచేసిన కోటక్ మహీంద్రా బ్యాంక్

by Disha Web Desk 17 |
ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలను నమోదుచేసిన కోటక్ మహీంద్రా బ్యాంక్
X

ముంబై: ప్రైవేట్ రంగ రుణదాత కోటక్ మహీంద్రా బ్యాంక్ జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో నికర లాభం 27 శాతం వృద్ధితో రూ. 2,580.68 కోట్లను నమోదు చేసింది. ఇది గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో రూ. 2,032 కోట్లుగా ఉంది. ఈ త్రైమాసికంలో తక్కువ కేటాయింపుల కారణంగా నికర లాభం ఊహించిన దానికంటే ఎక్కువగా పెరిగినట్లు బ్యాంకు తెలిపింది. డిపాజిట్లు ఏడాది ప్రాతిపదికన 11.4% పెరిగి, రెండవ త్రైమాసికం ముగింపులో రూ. 3.25 లక్షల కోట్లుగా ఉన్నాయి. బ్యాంక్ అడ్వాన్స్‌లు కూడా 25% పెరిగి సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ. 2.94 లక్షల కోట్లుగా ఉన్నాయి. క్రెడిట్ కార్డులు వార్షిక ప్రాతిపదికన 81% వృద్ధి చెందాయి.

రెండవ త్రైమాసికంలో గృహ రుణాలు, ఆస్తిపై రుణాలు ఏడాది ప్రాతిపదికన 80% పెరిగి రూ. 85,843 కోట్లకు చేరుకున్నాయి. నికర వడ్డీ ఆదాయం, సంపాదించిన వడ్డీ, ఖర్చు చేసిన వడ్డీ మధ్య వ్యత్యాసం క్రితం సంవత్సర కాలం రూ. 4,021 కోట్ల నుంచి రూ. 5,099 కోట్లకు చేరుకుంది. బ్యాంక్ స్థూల నాన్-పెర్ఫార్మింగ్ అసెట్ రేషియో వరుసగా 16 బేసిస్ పాయింట్లు తగ్గి 2.08%కి పడిపోయింది.

ఇవి కూడా చదవండి :

నిధుల సమీకరణ కోసం ఐపీఓకు వెళ్లనున్న 'ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్'

Next Story