ఈ ఏడాది కొత్తగా 100 కరూర్ వైశ్యా బ్యాంక్ బ్రాంచులు

by Gopi |
ఈ ఏడాది కొత్తగా 100 కరూర్ వైశ్యా బ్యాంక్ బ్రాంచులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రైవేట్ రంగ కరూ వైశ్యా బ్యాంక్ కొత్తగా 100 బ్రాంచులను ప్రారంభించనుంది. ఈ మేరకు బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ బి రమేష్ బాబు ఓ ప్రకటనలో వెల్లడించారు. బుధవారం అయోధ్యలో బ్యాంకు తన 840వ బ్రాంచును బ్యాంక్ ఛైర్‌పర్సన్ మీనా హేమచంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఈఓ రమేష్ బాబు.. ఇప్పటికే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 39 బ్రాంచులను అందుబాటులోకి తీసుకొచ్చాం. 2024-25 ముగిసేలోపు దేశవ్యాప్తంగా కొత్త 100 బ్రాంచులు తీసుకురావాలని లక్ష్యంగా ఉన్నాం. 2023-24లో బ్యాంకు రూ. 1,605 కోట్ల వార్షిక లాభాలను సాధించింది. ఈ ఏడాది మార్చి 31 నాటికి బ్యాంకు ఎన్‌పీఏలు 0.40 శాతంతో మెరుగ్గా ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో మరింత సమర్థవంతంగా వృద్ధి సాధించగలం. ఎన్‌పీఏల నాణ్యత, లాభదాయకతలో స్థిరత్వం ద్వారా వేగంగా విస్తరణను కొనసాగించగలమని' ఆయన వివరించారు. అయోధ్యలో కొత్త బ్రాంచ్ ప్రారంభానికి బ్యాంకు డైరెక్టర్లు కె ఎస్ రవిచంద్రన్, ఆర్ రామ్ కుమారు, కే జి మోహన్ పాల్గొన్నారు.

Next Story