ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో నాలుగో స్థానానికి పడిపోయిన జపాన్

by Disha Web Desk 17 |
ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో నాలుగో స్థానానికి పడిపోయిన జపాన్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని అంచనా వేసిన జపాన్ ఆర్థిక వ్యవస్థ క్షీణించి నాలుగో స్థానానికి పడిపోయింది. ఇటీవల వచ్చిన నివేదిక ప్రకారం, 2023లో జర్మనీ జీడీపీ 4.4 ట్రిలియన్ డాలర్లు కాగా, జపాన్‌ది 4.2 ట్రిలియన్ డాలర్లుగా నమోదైంది. జపాన్ కరెన్సీ అమెరికా కరెన్సీతో పోలిస్తే 2022లో దాదాపు ఐదవ వంతు క్షీణించగా, 2023లో అది ఏడు శాతం తగ్గింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఎగుమతిపై ఆధారపడిన జర్మనీ తయారీదారులు ఇంధన ధరలు పెరగడం ద్వారా ఎక్కువగా ప్రభావితమయ్యారు. అలాగే దేశంలో పిల్లల సంఖ్య తగ్గడం, వృద్ధుల సంఖ్య పెరగడం కూడా జపాన్ ఇతర దేశాలతో పోటీ వాతావరణాన్ని నిలబెట్టుకోలేకపోయింది.

జర్మనీ, జపాన్ రెండు దేశాలు కూడా జనాభా తగ్గుదలతో బాధపడుతున్నప్పటికి జర్మనీ కంటే జపాన్‌లో ఈ సమస్య కొంచెం ఎక్కువగా ఉంది. 2023 చివరి మూడు నెలల్లో జపాన్ ఆర్థిక వ్యవస్థ 0.1 శాతం త్రైమాసికానికి తగ్గిందని, 0.2 శాతం వృద్ధి మార్కెట్ అంచనాలను కోల్పోయిందని గురువారం వెలువడిన డేటా నివేదించింది. 2000ల నుంచి జర్మనీలోని ప్రభుత్వ అధికారులు దేశంలో కంపెనీల కార్యకలాపాలను సులభతరం చేసే విధానాలను వేగవంతం చేయడం ద్వారా జపాన్ లాగా, జర్మనీ జనాభా తగ్గుతున్నప్పటికి అది స్థిరమైన ఆర్థిక వృద్ధిని సాధించిందని డై-ఇచి లైఫ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లోని ఆర్థికవేత్త తోషిహిరో నాగహమా అన్నారు. గతంలో 1970- 80ల సంవత్సరాలలో జపాన్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని కొందరు అంచనా వేశారు. కానీ 1990ల నుంచి తగ్గుతూ వస్తుంది. 2010లో జపాన్‌ను దాటి చైనా రెండో ఆర్థిక వ్యవస్థగా నిలిచింది.

Next Story