మరో కంపెనీపై హిండెన్‌బర్గ్ పంజా! వేల కోట్ల సంపద ఆవిరి

by Disha Web Desk 17 |
మరో కంపెనీపై హిండెన్‌బర్గ్ పంజా! వేల కోట్ల సంపద ఆవిరి
X

వాషింగ్టన్: అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్‌పై చేసిన ఆరోపణలతో కంపెనీ మార్కెట్ విలువ సగానికి పైగా పతనమైన సంగతి తెలిసిందే. తాజాగా ఆర్థిక సేవల కంపెనీ, ట్విట్టర్ సహ-వ్యవస్థాపకుడు జాక్ డొర్సె స్థాపించిన బ్లాక్‌పై హిండెన్‌బర్గ్ ఆరోపణలు బహిర్గతం చేసింది. దాంతో బ్లాక్ కంపెనీ షేర్లు దెబ్బతిన్నాయి. దీనివల్ల జాక్ డొర్సె సంపద ఏకంగా 526 మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో సుమారు రూ. 4,337 కోట్ల కరిగిపోయింది.

బ్లూమ్‌బర్గ్ బిలీయనీర్స్ ఇండెక్స్ తాజా డేటా ప్రకారం, జాక్ డొర్సె సంపద 11 శాతానికి పైగా క్షీణించి 4.4 బిలియన్ డాలర్లకు పడిపోయింది. తాజా నివేదిక ప్రకారం, బ్లాక్ కంపెనీ నిర్వాహకులు భారీ స్థాయిలో అక్రమాలకు పాల్పడ్డారని హిండెన్‌బర్గ్ ఆరోపించింది. కంపెనీ చెల్లింపులు, మొబైల్ బ్యాంకింగ్ సేవల్లో నకిలీ వ్యాపారులు, ఖాతాదారులు సగానికి పైగా ఉన్నారని తెలిపింది.

తద్వారా పెట్టుబడిదారులతో పాటు ప్రభుత్వాన్ని మోసం చేసిందని, కంపెనీ కస్టమర్లలో చాలామంది అక్రమ వ్యాపారాలను నిర్వహిస్తున్నట్టు వెల్లడించింది. ఈ విషయాలను బ్లాక్ మాజీ ఉద్యోగులే చెప్పారని తెలిపింది. ఈ ప్రకటనలో బ్లాక్ ఇంక్ కంపెనీ షేర్లు భారీగా నష్టపోయాయి. దానివల్ల కంపెనీలో అధిక వాటా కలిగిన జాక్ డొర్సె సంపద వేల కోట్లు ఆవిరయ్యాయి.

Also Read..

చిన్న బ్యాంకే కానీ.. మిగతా వాటికంటే ఎక్కువ వడ్డీని ఆఫర్ చేస్తుంది!



Next Story

Most Viewed