దేశీయ ఐటీ పరిశ్రమ వృద్ధి 3.8 శాతం

by Dishanational1 |
దేశీయ ఐటీ పరిశ్రమ వృద్ధి 3.8 శాతం
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఐటీ పరిశ్రమ వృద్ధి రేటు సింగిల్ డిజిట్‌కి పరిమితం కానుందని పరిశ్రమల సంఘం నాస్కామ్ అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3.8 శాతం వృద్ధి చెందిన 254 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని శుక్రవారం ప్రకటనలో తెలిపింది. హార్డ్‌వేర్ మినహాయించి ఆదాయం 199 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని అంచనా. ఇది గత ఆర్థిక సంవత్సరం కంటే 3.3 శాతం అధికం. 2023-24లో మొత్తం ఎగుమతుల ద్వారా రాబడి ఇంజనీరింగ్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్(ఆర్అండ్‌డీ) రంగం మాత్రమే 48 శాతం ఉంటుందని నాస్కామ్ తన వార్షిక సమీక్షలో పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 2023లో టెక్ ఖర్చులో 50 శాతం తగ్గుదల, టెక్ కాంట్రాక్ట్‌లలో 6 శాతం క్షీణత ఉన్నప్పటికీ వృద్ధి 3.8 శాతంగా అంచనా వేసింది. పెద్ద ఎత్తున ప్రతికూలత ఉన్నప్పటికీ ఐటీ పరిశ్రమలో కొత్తగా 60,000 ఉద్యోగాల కల్పన జరిగిందని, సమీక్షించిన కాలంలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 55.3 లక్షలకు చేరుకుందని నాస్కామ్ వెల్లడించింది.


Next Story

Most Viewed