రైలు టికెట్‌తో పాటు ఆటోమెటిక్‌గా రూ.10 లక్షల బీమా!

by Disha Web Desk 17 |
రైలు టికెట్‌తో పాటు ఆటోమెటిక్‌గా రూ.10 లక్షల బీమా!
X

న్యూఢిల్లీ: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్‌సీటీసీ) రైలు ప్రయాణీకుల బీమా పథకంలో మార్పులు చేసింది. ఐఆర్‌సీటీసీ పోర్టల్ ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకునేటప్పుడు ప్రయాణీకులకు ఆటోమేటిక్‌గా రూ. 10 లక్షల వ్యక్తిగత ప్రమాద బీమా కవరేజీ అందించే సదుపాయాన్ని తీసుకొచ్చింది.

ఈ నిర్ణయంతో సంస్థ వెబ్‌సైట్ లేదా యాప్ నుంచి టికెట్ బుకింగ్ చేసుకునే సమయంలో ప్రయాణ బీమా ఆప్షన్‌ను విడిగా ఎంచుకునే అవసరం ఉండదు. డిఫాల్ట్‌గా ఇది ఎన్నికవుతుంది. దానివల్ల టికెట్లను బుక్ చేసుకునే తొందరలో వినియోగదారులు మర్చిపోయే ఈ సదుపాయం ఆటొమెటిక్‌గా లభిస్తుంది. అయితే, ఈ సదుపాయం వద్దనుకునే వినియోగదారులు ఆప్షన్‌పై ఉండే టిక్ మార్కును తీసేసే అవకాశం కూడా ఉంటుందని ఐఆర్‌సీటీసీ వెల్లడించింది.

అయితే, భారత బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ నిబంధనల ప్రకారం, ఏ సంస్థ అయినా సరే డిఫాల్ట్‌గా బీమా సౌకర్యం ఇవ్వకూడదు. కానీ, ఐఆర్‌సీటీసీకి మాత్రమే వెసులుబాటు కల్పించింది. దీనివల్ల రైలులో ప్రయాణం చేసే వారికి ప్రమాద సమయంలో ఏదైన జరిగితే బీమా మొత్తం రూ. 10 లక్షలు అందుతాయి.

ఎక్కువ ప్రమాదం ఏర్పడి అంగవైకల్యానికి గురైతే రూ. 7.5 లక్షలు, గాయాలపాలైతే వైద్య ఖర్చులకు రూ. 2 లక్షల వరకు ఇవ్వడం జరుగుతుంది. బీమా పాలసీ ఎంచుకునే ప్రయాణీకులు నామినీ వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ వివరాలు ఇవ్వకపోయినా వ్యక్తి మరణిస్తే ఆ వ్యక్తి వారసులు బీమా పొందవచ్చు.



Next Story

Most Viewed