10 నెలల గరిష్టానికి విదేశీ మారక నిల్వలు!

by Disha Web Desk 17 |
10 నెలల గరిష్టానికి విదేశీ మారక నిల్వలు!
X

ముంబై: భారత విదేశీ మారక నిల్వలు 10 నెలల గరిష్ట స్థాయికి చేరాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) తాజా గణాంకాల ప్రకారం ప్రస్తుత ఏడాది ఏప్రిల్ 28 తో ముగిసిన వారానికి విదేశీ మారక నిల్వలు అంతకుముందు వారంతో పోలిస్తే 4.5 బిలియన్ డాలర్లు పెరిగి 588.78 బిలియన్ డాలర్లకు చేరాయి. రూపాయి మారకానికి మద్దతిస్తూ ఆర్‌బీఐ జోక్యం చేసుకోవడంతో నిల్వలు పెరిగాయి.

విదేశీ మారక నిల్వల్లో సింహ భాగమైన కరెన్సీ ఆస్తుల విలువ 4.996 బిలియన్ డాలర్లు పెరిగి 519.485 బిలియన్ డాలర్లకు చేరిందని ఆర్‌బీఐ తెలిపింది. అయితే, బంగారం నిల్వలు 494 మిలియన్ డాలర్లు తగ్గి 45.657 బిలియన్ డాలర్లకు చేరాయి. దేశంలో 2021 అక్టోబర్‌లో ఎప్పుడూ లేనంతగా విదేశీ మారకపు నిల్వలు 645 బిలియన్‌ డాలర్ల గరిష్ఠ స్థాయికి చేరాయి. అయితే, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో రూపాయిపై ఒత్తిడి తలెత్తడంతో ఆర్‌బీఐ చర్యలు చేపట్టింది. దానికోసం పెద్ద ఎత్తున డాలర్లు ఖర్చు చేసింది. దాంతో ఇటీవల విదేశీ మారకపు నిల్వలు కొంతమేర తగ్గాయి.

ఈ క్రమంలో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడం, ద్రవ్యోల్బణం కట్టడి, మూలధన వ్యయంపై దృష్టి, కరెంట్ ఖాతా లోటు తగ్గడం వంటి అంశాలు విదేశీ మారక నిల్వలు పెరిగేందుకు దోహదపడ్డాయని ఆర్‌బీఐ పేర్కొంది. శుక్రవారం సాయంత్రానికి అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి 81.74 స్థాయిల దగ్గర ఉంది.



Next Story

Most Viewed