$642.63 బిలియన్లకు భారత ఫారెక్స్ నిల్వలు

by Disha Web Desk 17 |
$642.63 బిలియన్లకు భారత ఫారెక్స్ నిల్వలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత విదేశీ మారక ద్రవ్య నిల్వలు(ఫారెక్స్) మార్చి 22తో ముగిసిన కాలానికి వరుసగా ఐదో వారంలో కూడా పెరిగి $642.63 బిలియన్లకు చేరుకున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం విడుదల చేసిన డేటా చూపించింది. రిపోర్టింగ్ వారంలో నిల్వలు $139 మిలియన్లు పెరిగాయి. ఇంతకుముందు మార్చి 15తో ముగిసిన వారంలో ఫారెక్స్ నిల్వలు $6.4 బిలియన్లు పెరిగి $642.49 బిలియన్లుగా నమోదయ్యాయి. ఆర్‌బీఐ విడుదల చేసన వీక్లీ స్టాటికల్ డేటా ప్రకారం, విదేశీ కరెన్సీ ఆస్తులు $123 మిలియన్లు క్షీణించి $568.264 బిలియన్లకు చేరుకున్నాయి. సమీక్ష వారంలో బంగారం నిల్వలు 347 మిలియన్ డాలర్ల నుంచి 51.487 బిలియన్ డాలర్లకు పెరిగాయి. అలాగే ప్రత్యేక డ్రాయింగ్ హక్కులు $57 మిలియన్లు తగ్గి $18.22 బిలియన్లకు చేరుకున్నాయి. ఐఎంఎఫ్‌లో భారత రిజర్వ్ స్థానం $27 మిలియన్లు తగ్గి $4.66 బిలియన్లకు చేరుకుంది.


Next Story

Most Viewed