- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
డిజిటల్ చెల్లింపుల్లో అమెరిక కంటే వేగంగా భారత్: ఎస్ జైశంకర్
దిశ, బిజినెస్ బ్యూరో: భారత డిజిటల్ చెల్లింపుల గురించి కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నగదు రహిత చెల్లింపులు, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) విషయంలో భారత్ అమెరికాను అధిగమించిందన్నారు. దేశంలో నెల రోజుల్లో జరిగే డిజిటల్ చెల్లింపులు అమెరికాలో మూడేళ్లలో జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. నైజీరియా పర్యటనలో భాగంగా అక్కడి భారతీయులతో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న జైశంకర్, భారత ఆర్థికవ్యవస్థ, కొవిడ్ వ్యాక్సిన్ తయారీ, సరఫరా అంశాల గురించి మాట్లాడారు. 'అత్యాధునిక టెక్నాలజీ వినియోగించడం ద్వారా భారతీయుల జీవన విధానం సులభంగా మారింది. ప్రస్తుతం దేశంలో నగదు చెల్లింపులు వాడుతున్న వారి సంఖ్య తక్కువగా ఉంది. ప్రపంచంలోనే బలమైన ఆర్థికవ్యవస్థగా అభివృద్ధి చెందుతున్నాం. దేశీయంగా రవాణా, మౌలిక సదుపాయాలు మెరుగవుతున్నాయి. కొవిడ్ మహమ్మారి సమయంలో అనేక సవాళ్లను ఎదుర్కొని ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్‌ని అందించే దిశగా ఎదిగామని' జైశంకర్ వివరించారు.