కష్టాల్లో భారత IT రంగం..! టెక్కీ లకు భారీ షాక్ తప్పదా?

by Disha Web Desk 17 |
కష్టాల్లో భారత IT రంగం..! టెక్కీ లకు భారీ షాక్ తప్పదా?
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా కాలంలో కూడా ఎంతో వెలుగువెలిగిన భారత ఐటీ రంగంలో సడన్‌గా కుదుపులు వచ్చాయి. ప్రపంచ ఆర్థిక మాంద్యం భయాలు క్రమంగా ఐటీ రంగాన్ని కూడా కమ్మేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు కొత్త రిక్య్రూట్‌మెంట్‌లను తగ్గించాయి. పెరుగుతున్న అనవసర ఇన్‌పుట్ ఖర్చులకు తగ్గించుకొడానికి ఉద్యోగాలలో కోత విధిస్తున్నాయి. దీంతో వేల మంది రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే ఆఫర్ లేటర్ వచ్చిన ఉద్యోగులను జాబ్‌లో చేర్చుకుంటారా లేదా అని ఆలోచనలో పడ్డారు.

2019-21 లో కరోనా మహమ్మారి తీవ్ర రూపం దాల్చింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రాణాలను కోల్పోయారు. అలాంటి టైంలో కూడా భారత ఐటీ రంగం ఎన్నో కొత్త ప్రాజెక్ట్‌లను పొందుతూ లాభాలను పొందింది. కరోనా టైంలో కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని అనుసరించి ప్రాజెక్ట్‌లను పూర్తి చేశాయి. అమెరికా, ఐరోపా తదితర దేశాల నుంచి కొత్త కొత్త ప్రాజెక్ట్‌లు రావడంతో భారీగా ఉద్యోగ నియమాకాలు చేపట్టాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మొత్తం మారిపోయింది.


ఏడాది క్రితం నుంచే మాంద్యం భయాలు క్రమంగా ప్రపంచాన్ని భయపెడుతున్నాయి. ఇప్పుడు అది కాస్తా పీకల దాకా రావడంతో టెక్ దిగ్గజాలు గూగుల్, ఇన్ఫోసిస్, విప్రో, మైక్రోసాఫ్ట్ వంటి పలు కంపెనీలు కొత్త ఉద్యోగ నియామకాలు తగ్గించాయి.

ఈ త్రైమాసికంలో కంపెనీల ఆర్థిక ఫలితాలు కూడా అనుకున్న స్థాయిలో నమోదు కాలేదు. షేర్ల ధరలు కూడా క్రమంగా తగ్గిపోతున్నాయి. కరోనా తగ్గుముఖం పట్టిన 2022 సంవత్సరంలో ఐటీ ఇండెక్స్ కాస్త 26 శాతం మేర పడిపోయి, కంపెనీలకు మాంద్యం భయాలను రుచి చూపించింది. ఇప్పటికే పెరుగుతున్న ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల ప్రభావం ఆర్థిక మాంద్యానికి దారి తీస్తుందని పలు కంపెనీల సీఈఓలు హెచ్చరిస్తున్నారు.

భారత ఐటీ రంగానికి ప్రధానంగా అమెరికా, ఐరోపా దేశాల నుంచి ఎక్కువగా క్లయింట్స్ ఉన్నారు. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు ప్రభావం ఆ దేశ కంపెనీలపై బలంగా ఉండటంతో వాటిని ఆధారంగా చేసుకొని నడిచే భారత కంపెనీలకు డేంజర్ బెల్స్ మోగినట్లయింది. జూనియర్ లెవల్ ఉద్యోగులకు ఎప్పుడు ఉద్యోగాలు తీసేస్తారో అనే భయం నెలకొంది. సీనియర్ ఉద్యోగార్థులకు మాత్రం ఈ విషయంలో భయం అవసరం లేదని పలు కంపెనీల అధికారులు పేర్కొంటున్నారు.

కంపెనీలు ఇప్పుడిప్పుడే వర్క్ ఫ్రం హోమ్‌ను ముగిస్తున్నాయి. ఉద్యోగులు క్రమంగా ఆఫీస్‌ల బాటా పడుతున్నారు. ఇలాంటి సమయంలో కొత్త ప్రాజెక్ట్‌లను పొందుతూ వెలుగువెలగాల్సిన ఐటీ రంగం కాస్త మాంద్యం భయాలతో ఉక్కిరిబిక్కిరి అవుతుంది.

కొత్తగా చదువు పూర్తి చేసుకుని ఉద్యోగాన్వేషణలో ఉన్నవారికి ఎంతో ఆశాజనకంగా కనపడిన ఐటీ రంగం, ఇప్పుడు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతుంది. ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని క్రమంగా తగ్గించి మాంద్యం భయాలు పోగోడితేనే ఇప్పుడు ఉన్న ఉద్యోగులకు భద్రత తో పాటు, కొత్తగా ఉద్యోగ అవకాశాలను సృష్టించగలం అని పలు కంపెనీల ఉన్నాతాధికారులు పేర్కొంటున్నారు.



Next Story

Most Viewed