2022-23లో 55 శాతం పెరగనున్న భారత మొబైల్‌ఫోన్ ఎగుమతులు!

by Disha Web Desk 17 |
2022-23లో 55 శాతం పెరగనున్న భారత మొబైల్‌ఫోన్ ఎగుమతులు!
X

న్యూఢిల్లీ: అధిక ఉత్పత్తి, మెరుగైన సరఫరా ఉన్న కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్ సుమారు రూ. 74.22 వేల కోట్ల(9 బిలియన్ డాలర్ల) విలువైన మొబైల్‌ఫోన్‌లను ఎగుమతి చేస్తుందని ఓ నివేదిక తెలిపింది. ఇది 2021-22 ఆర్థిక సంవత్సరంలో జరిగిన రూ. 47.83 వేల కోట్ల కంటే 55 శాతం ఎక్కువ.

పరిశ్రమ సంఘం ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్(ఐసీఈఏ) డేటా ప్రకారం, భారత్‌లో మొత్తం ఎలక్ట్రానిక్స్ తయారీ 2025-26 నాటికి రూ. 24.74 లక్షల కోట్లకు చేరుకోనుంది. ఇది ప్రస్తుతం రూ. 7.18 లక్షల కోట్లుగా ఉంది. ఇప్పటికే మొబైల్‌ఫోన్ ఎగుమతులు రూ. 41.22 వేల కోట్ల(5 బిలియన్ డాలర్ల)ను అధిగమించాయి. గతేడాది ఉన్న రూ. 18 వేల కోట్ల కంటే రెండు రెట్లు పెరిగాయి. మొబైల్‌ఫోన్ తయారీలో ప్రధానంగా శాంసంగ్, యాపిల్ బ్రాండ్లు ఉన్నాయి. భారత్‌లో తయారయ్యే ఫోన్‌లలో సగం ఈ రెండు బ్రాండ్లదే అని ఐసీఈఏ పేర్కొంది.


Next Story

Most Viewed