ఒకప్పుడు మన దేశంలో 10,000 నోట్లు, 5,000 నోట్లు ఉండేవని మీకు తెలుసా?

by Dishafeatures2 |
ఒకప్పుడు మన దేశంలో 10,000 నోట్లు, 5,000 నోట్లు ఉండేవని మీకు తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: 2016లో కేంద్ర ప్రభుత్వం రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేసింది. అనంతరం కొత్తగా 2000 రూపాయల నోట్లు, కొత్త రూపంలో రూ. 500 నోట్లను తీసుకొచ్చింది. కాగా పెద్ద నోట్ల వల్ల బ్లాక్ మనీ పెరిగిపోయే ఛాన్స్ ఉందని, క్లీన్ నోట్ పాలసీలో భాగంగా రూ.2 వేల నోట్లను రద్దు చేస్తున్నట్లు మే 19న ఆర్బీఐ ప్రకటించింది. అయితే మన దేశంలో ప్రవేశపెట్టిన నోట్లల్లో రూ.2 వేల నోటే పెద్ద నోటు అని చాలా మంది అనుకుంటుంటారు. కానీ ఇది ఏమాత్రం నిజం కాదు. కొన్నేళ్ల కిందటే ఆర్బీఐ రూ.10,000, రూ.5,000 నోట్లను ప్రవేశపెట్టింది. ఆర్బీఐని 1935లో స్థాపించారు. ఇక 1938లో ఆర్బీఐ రూ.10 వేల నోట్లను మొదటిసారి ప్రవేశపెట్టింది.

అయితే కొన్ని కారణాల రీత్యా 10,000 నోట్లను ఆర్బీఐ రద్దు చేసింది. ఇక మళ్లీ 1954లో రూ.10 వేల నోట్లతో పాటు రూ.5 వేల నోట్లను ప్రవేశపెట్టారు. అయితే ఈ రెండు నోట్లను 1978లో రద్దు చేశారు. కాగా ఆర్బీఐ ప్రింట్ చేసిన అతి పెద్ద నోటు ఇప్పటి వరకు రూ. 10 వేల నోటు మాత్రమే. ఇక ఈ పెద్ద నోట్లు దాదాపు 32 సంవత్సరాల పాటు చలామణిలో ఉన్నాయి. ఇక రంగరాజన్ ఆర్బీఐ గవర్నర్ గా ఉన్న సమయంలో రూ.5,000, రూ.10,000 నోట్లను తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. కానీ పెద్ద నోట్ల వల్ల నకిలీ నోట్లు పెరిగే ఛాన్స్ ఉందని అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఫైనల్ గా పీఎం మోడీ, అరుణ్ జైట్లీ 2017లో రూ.2000 నోట్లను ప్రవేశపెట్టేందుకు అంగీకరించారు.

Also Read..

భారత్‌లో తయారీ ప్లాంటు ఏర్పాటుపై ఎలన్ మస్క్ ప్రకటన!

Next Story

Most Viewed