హార్లిక్స్ లేబుల్‌ను తొలగించిన HUL.. ఎందుకంటే..

by Disha Web Desk 17 |
హార్లిక్స్ లేబుల్‌ను తొలగించిన HUL.. ఎందుకంటే..
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత్‌లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్లకు బాగా ఇష్టమైన ప్రముఖ బ్రాండ్ హార్లిక్స్‌ లేబుల్‌ను మారుస్తూ హిందూస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ (HUL) కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ గా పిలిచే హార్లిక్స్ ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మారుస్తూ కొత్తగా ప్రకటన విడుదల చేసింది. ఇటీవల వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లను వారి సైట్‌లలో 'హెల్త్' కేటగిరీ నుండి అన్ని పానీయాలు తొలగించాలని ఆదేశించిన తర్వాత HUL ఈ నిర్ణయం తీసుకుంది. హిందుస్థాన్ యూనిలీవర్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రితేష్ తివారీ మాట్లాడుతూ, హార్లిక్స్‌ లేబుల్‌ను కొత్తగా మార్చడం వల్ల స్పష్టమైన ప్రాతినిధ్యం లభిస్తుందని అన్నారు.

అంతకుముందు, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 ప్రకారం 'హెల్త్ డ్రింక్స్'కి నిర్వచనం లేదని ప్రభుత్వం చెప్పింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లలో డైరీ, తృణధాన్యాలు లేదా మాల్ట్ ఆధారిత పానీయాలను 'హెల్త్ డ్రింక్' లేదా 'ఎనర్జీ డ్రింక్' కేటగిరీల క్రింద ఉంచవద్దని, ఎందుకంటే ఇవి వినియోగదారులను తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని తెలిపింది. కొద్ది రోజుల క్రితం బోర్న్‌విటా వంటి పానీయాలను 'హెల్త్ డ్రింక్' కేటగిరీ లేబుల్‌ నుంచి తొలగించాలని ప్రభుత్వం ఈ కామర్స్ సంస్థలను ఆదేశించింది.



Next Story

Most Viewed