ఈవీ ల కొరతను తీర్చేందుకు హీరో ఎలక్ట్రిక్, మహేంద్ర భాగస్వామ్యం!

by Web Desk |
ఈవీ ల కొరతను తీర్చేందుకు హీరో ఎలక్ట్రిక్, మహేంద్ర భాగస్వామ్యం!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రముఖ వాహన తయారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్, మహీంద్రా గ్రూప్ మధ్య బుధవారం కీలక భాగస్వామ్యం కుదిరింది. ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) తయారీ కోసం ఇరు సంస్థలు ఒప్పందం చేసుకున్నట్టు వెల్లడించాయి. దేశంలో వేగవంతంగా పెరుగుతున్న ఈవీ గిరాకీని తీర్చేందుకు ఇరు కంపెనీలు వ్యూహాత్మక ఒప్పందంలో భాగంగా హీరో ఎలక్ట్రిక్, ఎన్‌వైఎక్ స్కూటర్లను మహీంద్రా గ్రూప్ సంస్థకు చెందిన ప్లాంట్‌లో తయారు చేయనున్నారు. దీనివల్ల ఈవీ కొరతను అధిగమించే అవకాశం ఉంటుందని కంపెనీ పేర్కొన్నాయి. ప్రస్తుతం హీరో ఎలక్ట్రిక్ కంపెనీ లూథియానా ప్లాంట్ విస్తరణ కూడా చేపట్టనున్నామని, తద్వారా ప్రస్తుత ఏడాది పూర్తయ్యే నాటికి ఏడాదికి 10 లక్షల ఈవీల తయారీ లక్ష్యాన్ని చేరుకుంటామని కంపెనీ తెలిపింది.

అలాగే, మహీంద్రా సంస్థతో భాగస్వామ్యం ద్వారా మహీంద్రా ప్యుగోట్ ఈవీ బైకును కూడా హీరో కంపెనీ తయారు చేయనుంది. దీంతో ఇరు సంస్థలకు చెందిన కొత్త ఉత్పత్తులతో సహా టెక్నాలజీ కోసం ఆర్అండ్‌డీ బృందాల మధ్య మెరుగైన నాలెడ్జ్ షేరింగ్‌కి వీలవుతుందని హీరో ఎలక్ట్రిక్ అభిప్రాయపడింది. కాగా, ప్రస్తుతం హీరో ఎలక్ట్రిక్ దేశీయంగా మొత్తం 12 ఎలక్ట్రిక్ స్కూటర్ల పోర్ట్‌ఫోలియోతో 4 లక్షల మంది వినియోగదారులను సాధించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 2,000 చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది.

Next Story

Most Viewed