Post Office స్కీమ్స్‌‌లలో కొత్త వడ్డీ రేట్ల పూర్తి లిస్ట్ ఇదే!

by Disha Web Desk 17 |
Post Office స్కీమ్స్‌‌లలో కొత్త వడ్డీ రేట్ల పూర్తి లిస్ట్ ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో రెపోరేటు వరుస పెరుగుదల నేపథ్యంలో బ్యాంకులు తమ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఈ మధ్య పెరిగిన కొత్త వడ్డీ రేట్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే దేశవ్యాప్తంగా ఎంతో ఆదరణ కలిగినటువంటి ప్రభుత్వ రంగ పోస్టాఫీసు కూడా వివిధ పథకాలపై వడ్డీ రేట్లను పెంచింది. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ వంటి వాటితో పాటు, వివిధ కాలపరిమితి కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లు 70 బేసిస్ పాయింట్ల మేర పెరిగింది. పెరిగిన ఈ వడ్డీ రేట్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం పోస్టాఫీసులో చాలా పొదుపు పథకాలు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో ఏ పథకానికి ఎంత వడ్డీ రేటు లభిస్తుందో ఒకసారి చూద్దాం..

* పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్: ఈ పథకంలో ప్రస్తుతం వడ్డీరేటు 7.1 శాతం ఉంది.

* సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్: ఈ స్కీమ్‌లో 60 ఏళ్లు పైబడిన వారికి ప్రస్తుతం 8.2 శాతం వడ్డీ లభిస్తుంది.

* నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్: దీనిలో వడ్డీ రేటు మారుతూ ఉంటుంది. ఇప్పుడు మాత్రం వడ్డీరేటు 7.7 శాతంగా ఉంది.

* సుకన్య సమృద్ధి యోజన: ఆడపిల్లల కోసం తీసుకొచ్చిన ఈ పథకంలో ప్రస్తుతం 8 శాతం వడ్డీ లభిస్తుంది.

* కిసాన్ వికాస్ పత్ర: ప్రస్తుతం 7.5 శాతం వడ్డీ ఇస్తున్నారు.

* పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్: ఈ పథకంపై 4 శాతం వడ్డీ లభిస్తుంది.

* పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్: దీనిలో వడ్డీ రేటు 6.2 శాతంగా ఉంది.

* పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకం: ప్రతి నెలా వడ్డీ అకౌంట్లో జమ చేస్తారు. వడ్డీ రేటు 7.4 శాతంగా ఉంది.

* (1 సంవత్సరం) పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్: ఈ పథకంలో 6.8 శాతం వడ్డీ ఇస్తున్నారు.

* (2 సంవత్సరాలు) పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్: దీనిలో వడ్డీ రేటు 6.9 శాతంగా ఉంది.

* (3 సంవత్సరాలు) పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్: ఈ పథకంలో 7 శాతం వరకు వడ్డీ లభిస్తుంది.

* (5 సంవత్సరాలు) పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్: దీనిలో ప్రస్తుతం 7.5 శాతం వడ్డీ వస్తుంది.


Next Story

Most Viewed