మధ్యంతర బడ్జెట్ విశేషాలు

by Dishanational1 |
మధ్యంతర బడ్జెట్ విశేషాలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించారు. ప్రధానీ మోడీ నేతృత్వంలో రైతు బీమా, పీఎం ఆవాస్ యోజనా వంటి పథకాల గురించి వివరిస్తూ, గడిచిన పదేళ్ల కాలంలో భారత వృద్ధిని, పురోగతిని సాధించిన విషయాలను వివరించారు. పేదల అభివృద్దే, దేశ అభివృద్ధి అని చెప్పిన ఆర్థిక మంత్రి, 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యం సాధ్యమవుతుందన్న నిర్మలా సీతారామన్ మౌలిక సదుపాయాల పెరుగుదలలో గణనీయంగా వృద్ధిని సాధించినట్టు పేర్కొన్నారు.

ఈ ఏడాది ఎన్నికలు ఉన్న నేపథ్యంలో తాత్కాలిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో భారత్‌లో ఇప్పటివరకు వచ్చిన మధ్యంతర బడ్జెట్‌ల గురించి ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం..

భారత మొదటి మధ్యంతర బడ్జెట్

భారత మొట్టమొదటి మధ్యంతర బడ్జెట్‌ను 1947లో ఆర్‌కె షణ్ముఖం చెట్టి సమర్పించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆహార ధాన్యాల కొరత, పెరిగిన దిగుమతులు, ఆకాశాన్నంటిన ద్రవ్యోల్బణంతో సహా దేశ ఆర్థిక కష్టాలను పరిష్కరించడానికి అప్పటి బడ్జెట్‌ను సమర్పించారు.

ఇప్పటి వరకు మధ్యంతర బడ్జెట్ ప్రసంగాలు

భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు పద్నాలుగు మధ్యంతర బడ్జెట్లు సమర్పించబడ్డాయి. చివరిగా 2019, ఫిబ్రవరిలో మాజీ ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్‌ ప్రవేశపెట్టారు. మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించడం కోసం గోయల్ తన ప్రసంగంలో 8,119 పదాలను ఉపయోగించారు. 1947లో ఆర్‌కె షణ్ముఖం చెట్టి సమర్పించిన దాని తర్వాత రెండవ సుధీర్ఘ మధ్యంతర బడ్జెట్ ప్రసంగం ఇదే.

గురువారం నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను కేవలం 58 నిమిషాల్లో ముగించారు. ఇప్పటివరకు నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగాల్లో ఇదే అతి చిన్నది.

నిర్మలమ్మ గత బడ్జెట్‌ల ప్రసంగ సమయాలు

2019 -2 గంటల 17 నిమిషాలు (137 నిమిషాలు)

2020 -2 గంటల 40 నిమిషాలు (160 నిమిషాలు)

2021 -1 గంట 50 నిమిషాలు (110 నిమిషాలు)

2022 -1 గంట 33 నిమిషాలు (93 నిమిషాలు)

2023 -1 గంట 27 నిమిషాలు (87 నిమిషాలు)

2024 - 58 నిమిషాలు

సుధీర్ఘమైన బడ్జెట్ ప్రసంగం రికార్డులు

2020లో 2.40 గంటల పాటు ప్రసంగం చేసి నిర్మలా సీతారామన్ దేశంలోనే అత్యధిక సమయం బడ్జెట్ ప్రసంగం చేసిన రికార్డును సాధించారు.

మధ్యంతర బడ్జెట్‌లో భారీ ప్రకటనలకు విముక్తి

దాదాపు రెండు దశాబ్దాల క్రితం, మధ్యంతర బడ్జెట్‌లు సాధారణ ప్రకటనలకే పరిమితమయ్యేవి. అయితే, 2004-5 నుండి, మధ్యంతర బడ్జెట్‌లలో పన్ను తగ్గింపులు, పథకాల పొడిగింపు, సబ్సిడీలకు సంబంధించిన ప్రకటనలు చేశారు. మాజీ ఆర్థిక మంత్రి జస్వంత్ సింగ్, 2004-05లో సమర్పించిన మధ్యంతర బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల 50 శాతం డియర్‌నెస్ అలవెన్స్‌ను బేసిక్ పే, కస్టమ్ డ్యూటీ తగ్గింపు ప్రకటించారు.

బ్రిటీష్ కాలంలో భారత మొదటి మధ్యంతర బడ్జెట్

స్వాతంత్ర్యానికి ముందు కూడా మనదేశంలో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు. భారత మొట్టమొదటి మధ్యంతర బడ్జెట్‌ను 1860లో ఈస్టిండియా కంపెనీతో కలిసి పనిచేసిన స్కాటిష్ ఆర్థికవేత్త జేమ్స్ విల్సన్ సమర్పించారు.


Next Story

Most Viewed