షాపింగ్‌ డీల్స్ కోసం Google కొత్త ఫీచర్

by Disha Web Desk 17 |
షాపింగ్‌ డీల్స్ కోసం Google కొత్త ఫీచర్
X

దిశ, వెబ్‌డెస్క్: సెర్చింజన్ దిగ్గజం గూగుల్ తన క్రోమ్‌లో కొత్తగా ఒక సదుపాయాన్ని తీసుకొచ్చింది. సెలవుల సమయంలో షాపింగ్ చేయాలనుకునేవారికి ఈజీగా ఉండేలా ఉత్పత్తుల ధరలు, డీల్స్, డిస్కౌంట్‌లను అన్ని ఇకే చోటా కనిపించేలా కొత్తగా ‘షాపింగ్ డీల్స్’ టూల్‌ను కంపెనీ తెచ్చింది. ఉదాహరణకు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై ఉన్నటువంటి బెస్ట్‌ డీల్స్ గురించి తెలుసుకోవాలంటే గూగుల్ షాపింగ్ ట్యాబ్‌లోకి వెళ్లి టైప్ చేయగానే తక్కువ ధరలో లభించే టాప్ ఉత్పత్తులు కనిపిస్తాయి.

సాధారణంగా షాపింగ్ చేసేటప్పుడు బెస్ట్ డీల్స్ గురించి తెలుసుకోవడానికి అన్ని సైట్లు వెతకాల్సి ఉంటుంది. అయితే ఈ గూగుల్ షాపింగ్ ట్యాబ్‌లో అన్ని డీల్స్ కూడా ఒకేసారి చూడవచ్చు. టాప్ డీల్స్ నుంచి మొదలుకుని ఆర్డర్‌గా అన్ని కనిపిస్తాయి. దుస్తులు, ఎలక్ట్రానిక్స్, బొమ్మలు, హోమ్ అప్లయెన్సెస్, కిచెన్, డైనింగ్ వంటి వాటిని కేటగిరీల వారీగా చూడవచ్చు. ఆ ప్రోడక్ట్‌లపై క్లిక్ చేయగానే నేరుగా అధికారిక సైట్‌కు వెళ్తుంది, అక్కడ అన్ని వివరాలు కనిపిస్తాయి.

అలాగే “Shopping insights” అనే లేబుల్‌ను కొత్తగా యాడ్ చేశారు. ఇది ప్రోడక్ట్‌కు సంబంధించిన ప్రైస్ హిస్టరీని చూపిస్తుంది. అంతకుముందు ఇది ఏ ధరలో ఉంది, ప్రస్తుతం ఎంత ఉంది. ధరలో మార్పులను క్లియర్‌గా చాట్ లాగా చూపిస్తుంది. షాపింగ్‌ను మరింత ఈజీ చేయడానికి డీల్స్‌ గురించిన అలర్ట్‌లను కూడా యూజర్లకు పంపించే ఆప్షన్‌ను కూడా తెచ్చారు. ఏదైనా వస్తువు ధర తగ్గినట్లయితే ఆ విషయాన్ని నోటిఫికేషన్ ద్వారా యూజర్లకు పంపిస్తుంది.



Next Story

Most Viewed