భారత ఈక్విటీల్లో కొనసాగుతున్న విదేశీ పెట్టుబడులు!

by Disha Web Desk 13 |
భారత ఈక్విటీల్లో కొనసాగుతున్న విదేశీ పెట్టుబడులు!
X

ముంబై: భారత ఈక్విటీ మార్కెట్లలో విదేశీ మదుపర్లు తిరిగి పెట్టుబడులకు మొగ్గు చూపుతున్నారు. అధిక వాల్యూయేషన్ నుంచి భారత స్టాక్ మార్కెట్లు సాధారణ స్థితికి చేరుకున్న కారణంతో విదేశీ పెట్టుబడిదారులు కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డిపాజిటరీ గణాంకాల ప్రకారం, ఈ నెలలో ఇప్పటివరకు భారత ఈక్విటీల్లో విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు(ఎఫ్‌పీఐ) రూ. 8,643 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.

ప్రధానంగా త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో ఫైనాన్సియల్ రంగంలోని షేర్లు ఎఫ్‌పీఐలకు ఆకర్షణీయంగా మారాయని నిపుణులు తెలిపారు. అలాగే, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టాటా మోటార్స్, ఐటీసీ వంటి దిగ్గజ షేర్లను ఎక్కువ కొంటున్నారని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ డాక్టర్ వి కె విజయకుమార్ తెలిపారు.

Next Story

Most Viewed