ఏప్రిల్‌లో రూ. 11 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టిన ఎఫ్‌పీఐలు!

by Disha Web Desk 13 |
ఏప్రిల్‌లో రూ. 11 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టిన ఎఫ్‌పీఐలు!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో విదేశీ పెట్టుబడులు అత్యంత సానుకూలంగా మారుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు(ఎఫ్‌పీఐ) భారత మార్కెట్లలోకి రూ. 11,630 కోట్ల నిధులను పెట్టారని గణాంకాలు వెల్లడించాయి. దిగ్గజ కంపెనీల షేర్లు ఆకర్షించే ధరల్లో ఉండటం, రూపాయి మారకం విలువ పుంజుకోవడం వంటి పరిణామాలతో ఎఫ్‌పీఐల సెంటిమెంట్ బలపడింది. అంతకుముందు మార్చి నెలకు సంబందించి ఎఫ్‌పీఐలు రూ. 7,936 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.

అయితే, ఆ సమయంలో దేశీయ అదానీ గ్రూప్ కంపెనీల్లోకి అమెరికాకు చెందిన జీక్యూజీ పార్ట్‌నర్స్ పెట్టుబడులు సహకరించాయి. జీక్యూజీ పార్ట్‌నర్స్ పెట్టుబడులు మినహాయిస్తే ఆ నెలలో ఎఫ్‌పీఐ పెట్టుబడులు ప్రతికూలంగా ఉన్నాయి. ఈ వారంలో జరిగే అమెరికా ఫెడ్ సమావేశంలో మరోసారి వడ్డీ రేట్లు పెరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఎఫ్‌పీఐల ధోరణి ఊగిసలాటకు గురవ్వొచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు. అయితే, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోలిస్తే భారత్ సానుకూలంగా ఉండటంతో ఎఫ్‌పీఐలు మన మార్కెట్లలో పెట్టుబడులను కొనసాగించవచ్చని అంచనా వేస్తున్నారు.

Next Story

Most Viewed