భారత ఈక్విటీల్లో రూ. 36 వేల కోట్లు దాటిన విదేశీ పెట్టుబడులు!

by Dishafeatures2 |
భారత ఈక్విటీల్లో రూ. 36 వేల కోట్లు దాటిన విదేశీ పెట్టుబడులు!
X

ముంబై: విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) భారత ఈక్విటీల్లో పెట్టుబడులను కొనసాగిస్తున్నారు. ప్రస్తుత నెలలో ఇప్పటివరకు వారు రూ. 36 వేల కోట్లకు పైగా నిధులను మార్కెట్లోకి చొప్పించారు. భారత ఆర్థికవ్యవస్థ ఆర్థిక గణాంకాలు సానుకూలంగా ఉండటం, కార్పొరేట్ రంగం ఆదాయం పటిష్టంగా ఉండటమే దీనికి కారణమని మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. డిపాజిటరీ గణాంకాల ప్రకరాం, ఈ ఏడాది మేలో ఎఫ్‌పీఐలు రూ. 43,838 కోట్లను, అంతకుముందు ఏప్రిల్‌లో రూ. 11,631 కోట్లు, మార్చిలో రూ. 7,936 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. దానికంటే ముందు జనవరి-ఫిబ్రవర్ నెలల్లో రూ. 34 వేల కోట్ల విలువైన నిధులౌ వెనక్కి తీసుకున్నారు. వరుస నెలల్లో కొనసాగుతున్న విదేశీ పెట్టుబడులు రానున్న రోజుల్లో నెమ్మదించే అవకాశాలు ఉన్నాయి.

ముఖ్యంగా అమెరికా ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని లక్ష్యం కంటే దిగువకు చేర్చేందుకు మరింత వడ్డీ పెంపు అవసరమని భావిస్తున్న నేపథ్యంలో ఎఫ్‌పీఐలు అప్రమత్తంగా ఉండేందుకు ప్రయత్నించవచ్చని కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్(రిటైల్) హెడ్ శ్రీకాంత్ చౌహాన్ అన్నారు.ఇటీవలే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ కీలక వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు పెంచింది. ఇది విదేశీ పెట్టుబడిదారులకు కొంత ఆందోళన కలిగించే అంశం. ఎందుకంటే పెరుగుతున్న భారత మార్కెట్ల వాల్యూయేషన్‌పై ప్రభావం చూపుతుంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి విదేశీ మదుపర్లు భారత ఈక్విటీల్లో రూ. 59,900 కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టారు. డెట్ మార్కెట్లలో రూ. 4,500 కొట్ల వరకు ఇన్వెస్ట్ చేశారు.

Next Story