తొమ్మిది నెలల గరిష్ఠానికి భారత ఫారెక్స్ నిల్వలు!

by Disha Web Desk 16 |
తొమ్మిది నెలల గరిష్ఠానికి భారత ఫారెక్స్ నిల్వలు!
X

ముంబై: ఈ ఏడాది ఏప్రిల్ 7వ తేదీతో ముగిసిన వారారనికి భారత విదేశీ మారక నిల్వలు 584.76 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇది తొమ్మిది నెలల గరిష్ఠమని భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) గణాంకాలు శుక్రవారం వెల్లడించాయి. అంతకుముందు వారంతో పోలిస్తే ఇది 6.3 బిలియన్ డాలర్లు పెరిగాయి. మార్చి 31తో ముగిసిన వారానికి సంబంధించి భారత ఫారెక్స్ నిల్వలు 578.449 బిలియన్ డాలర్లుగా నమోదైన సంగతి తెలిసిందే. విదేశీ కరెన్సీ ఆస్తుల్లో పెరుగుదలే సమీక్షించిన వారంలో విదేశీ మారక నిల్వలు పుంజుకునేందుకు ప్రధాన కారణమని ఆర్‌బీఐ తెలిపింది. భారత కరెన్సీ రూపాయి మారకాన్ని బలపరచడంలో ఆర్‌బీఐ జోక్యంతో ఫారెక్స్ నిల్వలు పెరిగాయి. గత వారంలో అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం స్వల్పంగా 0.3 శాత పెరిగి రూ. 81.83 వద్ద ఉండగా, తాజాగా శుక్రవారం నాటికి రూపాయి మారకం విలువ రూ. 81.76 వద్ద ఉంది.

Also Read..

అన్ని ప్యాసింజర్ వాహనాల ధరలు పెంచిన టాటా మోటార్స్!



Next Story