ట్రాక్టర్ల వ్యాపారం మూసేస్తున్న ఫోర్స్ మోటార్స్

by Dishanational1 |
ట్రాక్టర్ల వ్యాపారం మూసేస్తున్న ఫోర్స్ మోటార్స్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ వాహన తయారీ సంస్థ ఫోర్స్ మోటార్స్ తన వ్యవసాయ ట్రాక్టర్ల వ్యాపారాన్ని మూసేస్తున్నట్టు శుక్రవారం ప్రకటించింది. మార్చి 31 నుంచే ట్రాక్టర్ల వ్యాపారం, సంబంధిత కార్యకలాపాలను నిలిపేస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది. వ్యాపార పునరుద్ధరణ, లాభాలు ఉన్న విభాగంపై ఎక్కువ దృష్టి సారించేందుకు, అందులో పెట్టుబడుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఫోర్స్ మోటార్స్ వివరించింది. భవిష్యత్తులో రవాణా, లాస్ట్ మైల్ మొబిలిటీ, సివిల్, డిఫెన్స్ విభాగంతో పాటు ఇతర వాటిపై కంపెనీ ఎక్కువ పని చేయనుంది. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొత్తం ఆదాయంలో వ్యవసాయ ట్రాక్టర్ల అమ్మకాలు 3.6 శాతంగా ఉన్నాయని ఫోర్స్ మోటార్స్ పేర్కొంది. మల్టీ-సీటర్ ప్యాసింజర్ వాహనాలను ఎక్కువగా తయారు చేసే ఫోర్స్ మోటార్స్ భారత్‌లో బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్ కార్ల కోసం ఇంజిన్‌లను తయారు చేస్తుంది. వాహనాల విక్రయాల ద్వారా 48 శాతం ఆదాయం సంపాదిస్తున్న కంపెనీ కాంట్రాక్ట్ ఇంజిన్‌ల తయారీ నుంచి 36 శాతం ఆదాయం పొందుతోంది.


Next Story

Most Viewed