20 లక్షల యూనిట్ల అమ్మకాల మార్కు చేరుకోనున్న ఈవీ పరిశ్రమ!

by Disha Web Desk 12 |
20 లక్షల యూనిట్ల అమ్మకాల మార్కు చేరుకోనున్న ఈవీ పరిశ్రమ!
X

న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరంలో దేశీయ ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు 20 లక్షల యూనిట్ల మార్కును చేరుకుంటాయని పరిశ్రమ నిపుణులు తెలిపారు. ప్రస్తుతం ఉన్న ధోరణిలోనే మార్కెట్, వినియోగదారుల నుంచి ఉన్న గిరాకీ కొనసాగితే అనుకున్న లక్ష్యం సులభంగా చేరుకోవచ్చు. ముఖ్యంగా కేంద్రం ఈవీల వృద్ధి కోసం తీసుకొచ్చిన ఫేమ్ 2 ఫలాలు పూర్తిస్థాయిలో అందలేదని, ఏప్రిల్ 1 నుంచి మొదలయ్యే 2023-24 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి అన్ని రకాలుగా మద్దతు లభించి, ఈవీ పరిశ్రమ ఊపందుకుంటుందని వెల్లడించారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈవీల రిటైల్ అమ్మకాలు ఇప్పటికే 11 లక్షల యూనిట్లను దాటేశాయి. ఇది మొత్తం దేశంలోని ఆటోమొబైల్ అమ్మకాల్లో 5 శాతం కంటే ఎక్కువగా వాటా. అంతకుముందు 2021-22 కంటే 147 శాతం పుంజుకోవడం గమనార్హం. మొత్తం ఈవీ అమ్మకాలకు ప్రధానంగా టూ-వీలర్, త్రీ-వీలర్, రైడింగ్ కోసం కొనుగోళ్ల ద్వారా మద్దతు లభిస్తోంది. కొత్త వాహనాలు మార్కెట్లోకి రావడం, ఛార్జింగ్ మౌలిక సదుపాయాల పెరుగుదల, తక్కువ ఖర్చు వంటి అంశాలు వినియోగదారులు ఈవీలు కొనేందుకు దోహదపడుతున్నాయని ఏథర్ ఎనర్జీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రవ్‌నీత్ ఫొకెలా పేర్కొన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed