భారీగా పడిపోయిన ఈవీ టూ-వీలర్ అమ్మకాలు!

by Disha Web Desk 17 |
భారీగా పడిపోయిన ఈవీ టూ-వీలర్ అమ్మకాలు!
X

న్యూఢిల్లీ: ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఎలక్ట్రిక్ టూ-వీలర్ అమ్మకాలు గణనీయంగా క్షీణించాయి. ప్రభుత్వ వాహన్ వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారం ప్రకారం, గత నెలలో 62,581 యూనిట్ల ఈవీ టూ-వీలర్లు అమ్ముడయ్యాయి. అంతకుముందు మార్చి 82,292 యూనిట్ల విక్రయాలు జరిగాయి. ప్రభుత్వం రెండు కీలక కంపెనీలపై తీసుకున్న కఠిన చర్యల వల్లనే అమ్మకాలు పడిపోయాయని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడ్డారు.

సమీక్షించిన నెలలో ఎలక్ట్రిక్ టూ-వీలర్ కంపెనీలు హీరో ఎలక్ట్రిక్, ఏథర్ ఎనర్జీ, ఒకినావా, టీవీఎస్ అమ్మకాలు 4 నెలల కనిష్ఠానికి తగ్గాయి. ఓలా ఎలక్ట్రిక్ మాత్రమే మార్చి కంటే అత్యధికంగా 21,560 యూనిట్లుగా నమోదయ్యాయి. కాగా, ఇటీవల కేంద్ర భారీ పరిశ్రమల విభాగం హీరో ఎలక్ట్రిక్, ఒకినావాలపై కఠిన చర్యలు తీసుకుంది. ప్రభుత్వ రాయితీ ప్రయోజనాల కోసం ఈవీల తయారీ కంపెనీలు 50 శాతం పరికరాలను స్థానికంగానే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయితే, హీరో ఎలక్ట్రిక్, ఒకినావా కంపెనీలు ఈ నిబంధనను ఉల్లంఘిస్తున్నాయి. ఈ వ్యవహారంపై పరిశ్రమల విభాగం ఆడిట్ ఇన్విస్టిగేషన్ చేపట్టింది.

Next Story

Most Viewed