అదానీ గ్రూప్‌ పెట్టుబడులపై కీలక ప్రకటన!

by Disha Web Desk 17 |
అదానీ గ్రూప్‌ పెట్టుబడులపై కీలక ప్రకటన!
X

ముంబై: దేశీయ అదానీ గ్రూప్ సోమవారం కీలక ప్రకటన విడుదల చేసింది. తమ కంపెనీల్లోకి 2019 నుంచి ఇప్పటివరకు 2.87 బిలియన్ డాలర్ల(రూ. 23.54 వేల కోట్ల) విలువైన వాటాను విక్రయించామని వెల్లడించింది. అందులో 2.55 బిలియన్ డాలర్ల(రూ. 21 వేల కోట్ల)ను కంపెనీ ప్రమోటర్లు అదానీ గ్రూప్ వ్యాపారాల్లోకి పెట్టుబడుల రూపంలో పెట్టారు. ఈ ప్రకటన ఇటీవల అదానీ కంపెనీల్లోకి రూ. 20 వేల కోట్లు ఎలా వచ్చాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలకు వివరణగా ప్రకటన వెలువడినట్లు తెలుస్తోంది.

అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ఎంటర్‌ప్రైజెస్ కంపెనీల్లో అబుదాబికి చెందిన ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ పీజేఎస్‌సీ సుమారు రూ. 21.27 వేల కోట్ల విలువైన వాటాను కొన్నదని, ఈ నిధులను కంపెనీ ప్రమోటర్లు అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ పవర్, అదానీ పోర్ట్స్ కంపెనీల్లోకి పెట్టుబడులుగా బదిలీ చేశారని కంపెనీ వివరించింది.

Next Story

Most Viewed