డిమాండ్‌కు తీర్చేందుకు తయారీని పెంచిన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీలు!

by Disha Web Desk 12 |
డిమాండ్‌కు తీర్చేందుకు తయారీని పెంచిన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీలు!
X

న్యూఢిల్లీ: దేశీయ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ రంగంలో అమ్మకాలు వచ్చే త్రైమాసికంలో ఊపందుకుంటాయని కంపెనీలు భావిస్తున్నాయి. గత కొంతకాలంగా చైనాలో కరోనా కారణంగా సరఫరా తలెత్తడంతో కంపెనీలకు గిరాకీ తగ్గింది. ప్రస్తుతం పరిస్థితులు సానుకూలంగా మారుతున్న క్రమంలో వచ్చే త్రైమాసికంలో డిమాండ్ కోలుకుంటుందని, తమ ఉత్పత్తులను ముందుగానే తెచ్చి ఉంచుకోవాలని కంపెనీ అభిప్రాయపడుతున్నాయి. అధిక ఇన్వెంటరీని కలిగి ఉండటం ద్వారా వినియోగదారుల నుంచి వచ్చే డిమాండ్‌ను పూర్తి చేయగలమని కంపెనీ చెబుతున్నాయి. ముఖ్యంగా అధిక ద్రవ్యోల్బణం కారణంగా గతేడాది దీపావళి తర్వాత కంపెనీలు ఉత్పత్తిని 40-50 శాతం తగ్గించాయి. ఇప్పుడిప్పుడే మళ్లీ గిరాకీ మొదలైంది.

మరికొన్ని వారాల్లో వేసవి రానున్నందున ఏసీ, రిఫ్రిజిరేర్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచామని ఎల్‌జీ ఇండియా వైస్-ప్రెసిడెంట్ దీపక్ బన్సాల్ అన్నారు. ఏసీ వంటి ఉత్పత్తుల కోసం ఇప్పటికే గిరాకీ పెరిగిందని, ప్రస్తుతానికి దానికి తగ్గ స్థాయిలో ఫినిష్‌డ్ ప్రోడక్టస్, కాంపొనెంట్‌ల ద్వారా వినియోగదారుల డిమాండ్ తీర్చే పనిలో ఉన్నామని దీపక్ తెలిపారు. కరోనా వల్ల ఏర్పడ్డ సరఫరా అంతరాయం, తర్వాత ద్రవ్యోల్బణం వల్ల నెమ్మదించింది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రాబోయే వేసవికి అధిక స్టాక్ కలిగి ఉండాలని నిర్ణయించామని టాటాకు చెందిన వోల్టాస్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ పేర్కొన్నారు.



Next Story

Most Viewed