2 నిమిషాల ఆన్‌లైన్ మీటింగ్‌.. 200 మంది ఉద్యోగులను తీసేసిన కంపెనీ

by Dishanational4 |
2 నిమిషాల ఆన్‌లైన్ మీటింగ్‌.. 200 మంది ఉద్యోగులను తీసేసిన కంపెనీ
X

దిశ, బిజినెస్ బ్యూరో : మరీ దారుణంగా 200 మంది కొలువులకు కోత పెట్టిందో కంపెనీ. గూగుల్ మీట్ కాల్‌ అంటూ ఫుల్‌టైం, పార్ట్‌టైం, కాంట్రాక్టు ఉద్యోగులందరినీ కాల్‌కు కనెక్ట్ చేసుకుంది. మీటింగ్ స్టార్ట్ అయిన రెండు నిమిషాల్లో వాళ్లందరిని రోడ్డున పడేసే విషం లాంటి విషయాన్ని చల్లగా చెప్పింది. గుడ్ బై అంటూ కంపెనీ పెద్దలు కాల్‌ను డిస్ కనెక్ట్ చేసి వెళ్లిపోయారు. ఈ చేదు అనుభవం.. అమెరికాకు చెందిన ప్రాప‌ర్టీ స్టార్ట‌ప్ ఫ్రంట్‌డెస్క్‌లో పనిచేసే ఉద్యోగులకు ఎదురైంది. ఈ పరిణామంతో ఇతర కంపెనీల టెకీల గుండెల్లోనూ రైళ్లు పరుగెత్తడం మొదలైంది. ఇంతకీ ఫ్రంట్‌డెస్క్‌ కంపెనీ 200 మంది ఉద్యోగులను ఎందుకు తీసేసింది అనుకుంటున్నారా ? దాని ఆన్సర్‌ను ఆ కంపెనీ సీఈవో జెస్సీ డిపింటో మాటల్లోనే చూడండి.. ‘‘కంపెనీ ఆర్థిక క‌ష్టాల్లో ఉంది. త్వరలో కోర్టులో దివాలా పిటిషన్ వేయనున్నాం. దీనిపై ప్ర‌భుత్వానికి ద‌ర‌ఖాస్తు చేయనున్నాం’’ అని ఆయన చెప్పుకొచ్చారు. 2017లో ఏర్పాటైన ఫ్రంట్‌డెస్క్ కంపెనీ అమెరికా వ్యాప్తంగా 1000 ఫ‌ర్నిష్డ్ అపార్ట్‌మెంట్లను నిర్వ‌హిస్తోంది. విస్కాన్సిన్‌కు చెందిన ప్ర‌త్య‌ర్ధి కంపెనీ జెన్‌సిటీని ఫ్రంట్‌డెస్క్ ఏడు నెలల కిందటే కొనుగోలు చేసింది. ఇంతలోనే ఉద్యోగుల‌పై వేటు వేస్తూ నిర్ణ‌యం తీసుకోవ‌డం గమనార్హం.

Next Story

Most Viewed