పూర్తి సామర్థ్యంతో పనిచేయనున్న దిగుమతి చేసుకున్న బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలు

by Disha Web Desk 17 |
పూర్తి సామర్థ్యంతో పనిచేయనున్న దిగుమతి చేసుకున్న బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ వేసివిలో విద్యుత్ డిమాండ్‌ను తీర్చడానికి కీలక చర్యలకు దిగిన కేంద్రం తాజాగా దిగుమతి చేసుకున్న బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇవి పూర్తి సామర్థ్యంతో అక్టోబర్ 31, 2024 వరకు పని చేయడాన్ని తప్పనిసరి చేస్తూ కొత్త సర్క్యూలర్ విడుదల చేసింది. గతంలో జూన్ 30 వరకు ఈ కేంద్రాలు పూర్తిస్థాయిలో పని చేయాలని ఆదేశాలు ఇవ్వగా ఇప్పుడు దానిని పొడిగించారు. విద్యుత్ చట్టం, 2003 అత్యవసర నిబంధన కింద ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు 16 గిగావాట్ల సామర్థ్యంతో దిగుమతి చేసుకున్న బొగ్గు ఆధారిత ప్లాంట్‌లను నిర్వహిస్తున్న టాటా పవర్, అదానీ పవర్‌తో సహా ఇతర కంపెనీల కార్యకలాపాలను కొనసాగించడానికి ఈ ఉత్తర్వులు అమలు చేసింది.

మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారత్ విద్యుత్ వినియోగంలో 8 శాతం పెరుగుదలను నమోదు చేసింది. ఇది రానున్న రోజుల్లో మరింత పెరుగుతుందని అంచనా. దేశంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలను తీర్చడానికి తాజాగా గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పాదక కేంద్రాలు తమ ప్లాంట్లను మే 1 నుండి జూన్ 30 వరకు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. అందుబాటులో ఉన్న వనరులను వాడుకుని దేశంలో విద్యుత్ కొరత రాకుండా చూడడానికి కేంద్రం అన్ని ప్రయత్నాలు చేస్తుంది.

Next Story

Most Viewed