Paytmలో కొంత వాటాను విక్రయించాలని చూస్తున్న చైనాకు చెందిన యాంట్ గ్రూప్

by Disha Web Desk 17 |
Paytmలో కొంత వాటాను విక్రయించాలని చూస్తున్న చైనాకు చెందిన యాంట్ గ్రూప్
X

బెంగళూరు: చైనాకు చెందిన జాక్ మా ఆధ్వర్యంలోని యాంట్ గ్రూప్ కో. సంస్థ ఫిన్‌టెక్ దిగ్గజం వన్ 97 కమ్యూనికేషన్స్(Paytm) లిమిటెడ్‌లో వాటాను తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి దీనికి సంబంధించిన చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయని ఒక నివేదిక పేర్కొంది. నియంత్రణ, ధరల సమస్యలు, ఇతర అంశాల ప్రాతిపదికన ఈ అంశం ముందుకు వెళ్తున్నట్లు నివేదిక సారాంశం. డిసెంబర్ నాటికి యాంట్ గ్రూప్, వన్ 97లో 24.8 వాటాను కలిగి ఉంది, అయితే తిరిగి కొనుగోలు చేయడం వల్ల బాకీ ఉన్న షేర్ల సంఖ్య తగ్గిన తర్వాత దాని హోల్డింగ్‌లు 25% పైన పెరిగాయి.

Paytm లో పెట్టుబడులను యాంట్ గ్రూప్ వెనక్కి తీసుకోవాలని చూస్తుండగా, భారతీయ టెలికమ్యూనికేషన్స్ దిగ్గజం సునీల్ మిట్టల్ తన ఆర్థిక సేవల విభాగం అయిన ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంకును Paytmలో విలీనం చేయాలని చూస్తున్నట్లు సమాచారం. దీనికోసం Paytmలో షేర్లను కూడా కొనుగోలు చేయాలని చూస్తున్నారు. ప్రస్తుతానికి ఈ చర్చలు ప్రారంభ దశలో ఉన్నాయి.

Next Story

Most Viewed