LIC సీఈఓగా సిద్ధార్థ మొహంతీని నియమించిన ప్రభుత్వం!

by Disha Web Desk 17 |
LIC సీఈఓగా సిద్ధార్థ మొహంతీని నియమించిన ప్రభుత్వం!
X

న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) సీఈఓగా సిద్ధార్థ మొహంతీని నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం ఆయన నియామకాన్ని ఖరారు చేస్తూ, ఎల్ఐసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈఓ), మేనేజింగ్ డైరెక్టర్(ఎండీ)గా 2025, జూన్ 7 వరకు కొనసాగుతారని పేర్కొంది. ఈ ఏడాది మార్చిలో కేంద్రం మొహంతీని మూడు నెలల పాటు తాత్కాలిక సీఈఓగా నియమించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో ద ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ బ్యూరో(ఎఫ్‌ఎస్‌ఐబీ) ఎల్ఐసీ చైర్మన్ పదవికి సిఫార్సు చేసింది.

ఎల్ఐసీలోని నలుగురు ఎండీల నుంచి ఎఫ్ఎస్ఐబీ ఛైర్మన్‌ను ఎంపిక చేస్తుంది. దీనిపై తాజాగా కేంద్రం నిర్ణయం తీసుకుంది. అంతకుముందు ఎల్ఐసీ సీఈఓగా ఉన్న ఎంఆర్ కుమార్ పదవీకాలం 2022, మార్చిలో ముగిసింది. అయితే, ఆ సమయంలో ప్రభుత్వం ఎల్ఐసీని ఐపీఓకు తెచ్చే ప్రయత్నం లో ఉండగా, కుమార్ పదవీకాలాన్ని ఒక సంవత్సరం పొడిగించింది. ఇక, సిద్ధార్థ మొహంతీ 2021, ఫిబ్రవరి నుంచి ఎల్ఐసీ ఎండీగా ఉన్నారు. దానికి ముందు ఆయన ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ఎండీ, సీఈఓగా చేశారు.

Advertisement

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Read Disha E paper
👉 Follow us on Google News
👉 Follow us on whatsapp channel



Next Story