సీఈఓ వైదొలగడంతో బైజూస్ ఇండియా బాధ్యతలు తీసుకున్న రవీంద్రన్

by Dishanational1 |
సీఈఓ వైదొలగడంతో బైజూస్ ఇండియా బాధ్యతలు తీసుకున్న రవీంద్రన్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఎడ్‌టెక్ దిగ్గజం బైజూస్‌కు కష్టాలు తప్పడంలేదు. ఇప్పటికే నిధుల కొరత, ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితులను ఎదుర్కొంటున్న సంస్థ తాజాగా బైజుస్ ఇండియా సీఈఓ అర్జున్ మోహన్ బాధ్యతలకు రాజీనామా చేసినట్టు సోమవారం కంపెనీ వర్గాలు వెల్లడించాయి. కంపెనీ అంతర్గతంగా పరిస్థితులు ప్రతికూలంగా మారడంతో సీనియర్ మేనేజ్‌మెంట్ స్థాయి ఉద్యోగులు కంపెనీ నుంచి బయటకు వెళ్తున్నారు. గతేడాదే బైజూస్ ఇండియా సీఈఓగా మృణాల్ మోహిత్ సంస్థను వీడిన తర్వాత బాధ్యతలు తీసుకున్న అర్జున్ మోహన్ సైతం సీఈఓ పదవికి గుడ్‌బై చెప్పడంతో ఆ బాధ్యతలను, బైజూస్ రోజువారీ కార్యకలాపాలను వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్ పర్యవేక్షిస్తారని కంపెనీ పేర్కొంది. ఇదే సమయంలో కంపెనీ తన వ్యాపారాన్ని లెర్నింగ్ యాప్, ఆన్‌లైన్ తరగతులు, ట్యూషన్ సెంటర్స్ వంటి మూడు విభాగాలుగా పునర్నిర్మాణాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగానే రవీంద్రన్ రోజూవారీ కార్యకలాపాలను చేపట్టనుండగా, అర్జున్ మోహన్ ఎక్స్‌టర్నల్ అడ్వైజరీగా సహకారం అందిస్తారని కంపెనీ పేర్కొంది.



Next Story

Most Viewed