దీపావళి పండుగ ఆఫర్.. అదిరిపోయే ప్లాన్స్‌ను తీసుకొచ్చిన నెట్‌వర్క్

by Disha Web Desk 17 |
దీపావళి పండుగ ఆఫర్.. అదిరిపోయే ప్లాన్స్‌ను తీసుకొచ్చిన నెట్‌వర్క్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(BSNL) దీపావళి పండుగ సందర్భంగా తన వినియోగదారులకు రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను తీసుకొచ్చింది. అవి ఒకటి రూ. 1198 ప్లాన్, రెండోది రూ. 439 ప్లాన్. ఈ రెండు ప్లాన్‌లను కూడా వినియోగదారులు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా పొందవచ్చు.

రూ. 439 ప్లాన్ 90 రోజుల పాటు వాలిడిటీ కలిగి ఉంటుంది. అదనంగా 300 SMS లు లభిస్తాయి. వినియోగదారులు ఈ ప్లాన్‌‌లో ఎలాంటి డేటాను పొందలేరు. వాయిస్ కాలింగ్ ప్రయోజనాలకు మాత్రమే ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది.

కాల్స్‌తో పాటు డేటా ప్రయోజనాలు కావాలనుకునే వినియోగదారులు రూ. 1198 ప్లాన్‌ని ఎంచుకోవచ్చు. వ్యాలిడిటీ 365 రోజులు ఉంటుంది. నెలకు 3GB డేటా, 300 నిమిషాల కాలింగ్, 30 SMSలు లభిస్తాయి. ప్రీపెయిడ్ ప్లాన్ గడువు ముగిసే వరకు ప్రతి నెల ప్రయోజనాలు పునరుద్ధరించబడతాయి. ఇతర వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ చూడగలరు. ఈ ప్లాన్ అన్ని ఏరియాలలో కాకుండా ఎంపిక చేసిన సర్కిల్లలో మాత్రమే అందుబాటులో ఉంది.



Next Story

Most Viewed