ఏప్రిల్-13: పసిడి ప్రియులకు భారీ గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు

by Disha Web Desk 6 |
ఏప్రిల్-13: పసిడి ప్రియులకు భారీ గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు
X

దిశ, ఫీచర్స్: ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా మహిళలు బంగారం కొనుగోలు చేస్తుంటారు. అయితే ఇటీవల పెళ్లిళ్లు ఉండటంతో పసిడి ధరలు అమాంతం భారీగా పెరిగి అందరినీ ఆందోళనకు గురి చేశాయి. దీంతో రేట్లు ఇంకా పెరుగుతాయి తప్ప తగ్గవని నిరాశ చెందారు. తాజాగా, నేడు బంగారం రేట్లు భారీగా తగ్గి కాస్త ఊరటనిచ్చాయి.

నిన్నటి ధరలతో పోల్చుకుంటే.. 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 700 తగ్గడంతో.. రూ. 66,500కి చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల బంగారంపై రూ. 760 తగ్గగా.. రూ. 72, 550గా విక్రయిస్తున్నారు. అలాగే కిలో వెండిపై 1000 తగ్గడంతో రూ. 89,000గా ఉంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయ్‌వాడలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

హైదరాబాద్‌లో బంగారం ధరలు:

22 క్యారెట్ల బంగారం ధర- రూ. 66,500

24 క్యారెట్ల బంగారం ధర- రూ. 72, 550

విజయవాడలో నేటి బంగారం ధరలు:

22 క్యారెట్ల బంగారం ధర- రూ. 66,500

24 క్యారెట్ల బంగారం ధర- రూ. 72, 550

Next Story

Most Viewed