15 శాతం మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న 'zoom'!

by Disha Web Desk 17 |
15 శాతం మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న zoom!
X

శాన్‌ఫ్రాన్సిస్కో: గతేడాది లక్షలాది మంది ఉద్యోగుల తొలగింపుల తర్వాత టెక్ పరిశ్రమ 2023 ను భారీ సంఖ్యలో ఉద్యోగాల కోతతో ప్రారంభించాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు దాదాపు 97 వేల మందిపై వేటు పడినప్పటికీ ఈ తొలగింపుల ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా మిగిలిన కంపెనీల బాటలోనే ప్రముఖ కమ్యూనికేషన్ టెక్నాలజీ కంపెనీ జూమ్ సైతం 15 శాతం మందిని తీసేస్తున్నట్టు తాజా ప్రకటనలో తెలిపింది.

కరోనా మహమ్మారి సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్‌కు సులువుగా జరిగేందుకు, ఉద్యోగులు, యాజమాన్యాలకు మధ్య వీడియో కనెక్టివిటీ ద్వారా ఎంతో సహకరించిన జూమ్ తొలగింపుల కంపెనీల జాబితాలో చేరింది. మొత్తం ఉద్యోగుల్లో 1,300 మంది వరకు ఇంటికి వెళ్లనున్నారని కంపెనీ తెలిపింది. దీనికి సంబంధించి ఉద్యోగులకు ఈ-మెయిల్ ద్వారా వివరాలను వెల్లడిస్తామని, తొలగించిన ఉద్యోగులందరూ మెరుగైన స్కిల్స్, పనితీరు కలిగిన వారేనని కంపెనీ సీఈఓ ఎరిక్ యువాన్ అన్నారు.

అమెరికాతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ కొంతమందిని తొలగించామని, ఉద్యోగులందరికీ ఆయా ప్రాంతాల్లోని స్థానిక చట్టాలను అనుసరించి బోనస్‌లు, హెల్త్‌కేర్, వేతన పరిహారం సహా ఇతర ప్రయోజనాలను అందజేస్తామని ఆయన వివరించారు. కరోనా సమయంలో వ్యాపారాల్లో సవాళ్లను ఎదుర్కొనేందుకు జూమ్‌ను ఏర్పాటు జరిగింది. దీనివల్ల చాలామంది ఉద్యోగులు, ప్రజలు కనెక్టివిటీ ప్రయోజనాలను పొందారు. భవిష్యత్తులో సైతం ఇదే సమర్థవంతమైన నిర్వహణకు, ఆర్థిక మాంద్యం, ఇతర సమస్యలను ఎదుర్కొనేందుకు కొందరిని తొలగించక తప్పలేదని జూమ్ సీఈఓ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Also Read...

వేలంలో ప్రపంచ రికార్డు నెలకొల్పిన 'Bugatti' కారు

Next Story

Most Viewed