చెన్నై, నాథ్‌ద్వారాలో 5G సేవలను ప్రారంభించిన ఆకాష్ అంబానీ

by Disha Web Desk 17 |
చెన్నై, నాథ్‌ద్వారాలో 5G సేవలను ప్రారంభించిన ఆకాష్ అంబానీ
X

చెన్నై: రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఛైర్మన్ ఆకాష్ అంబానీ జియో 5G సేవలను చెన్నై, రాజస్థాన్‌లోని నాథ్‌ద్వారా పట్టణంలో ఇటీవల ప్రారంభించారు. అదనంగా విద్యా సంస్థలు, మతపరమైన ప్రదేశాలు, రైల్వే స్టేషన్‌లు, బస్టాండ్‌లు, వాణిజ్య కేంద్రాలు మొదలగు ప్రాంతాలలో JioTrue5G-ఆధారిత Wi-Fi సేవలను కూడా ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. జియో ట్రూ 5G సేవలు మొదట నాలుగు నగరాలు.. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, వారణాసిలో బీటా ట్రయల్‌లో భాగంగా ప్రారంభించారు. ఇది 1Gbps+ వేగంతో అపరిమిత 5G డేటాను అందిస్తుంది.

"4G Wi-Fi నెట్‌వర్క్‌లతో పోలిస్తే, 5G నెట్‌వర్క్‌లు మెరుగైన విశ్వసనీయత, మెరుగైన కవరేజ్, డేటా భద్రత అందిస్తాయి. పైగా ధరలు కూడా తక్కువగా ఉంటాయి. త్వరలో దేశవ్యాప్తంగా మరిన్ని ప్రాంతాలకు 5Gని అందుబాటులోకి తీసుకొస్తామని ఆకాష్ అంబానీ" తెలిపారు. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ సెప్టెంబర్ త్రైమాసికంలో స్వతంత్ర నికర లాభంలో సంవత్సరానికి 28 శాతం వృద్ధిని (రూ. 4,518 కోట్లు) నమోదు చేసింది. లాభం సీక్వెన్షియల్ ప్రాతిపదికన 4 శాతం పెరిగింది. సమీక్షిస్తున్న త్రైమాసికంలో కంపెనీ రూ. 22,521 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది, ఇది ఏడాది క్రితంతో పోలిస్తే 20 శాతం వృద్ధి చెందింది.

జియో 5G సేవలను మరింత విస్తరించడానికి కంపెనీ, అధిక సామర్థ్యంతో 5G మాసివ్ MIMO యాంటెనాలు, వివిధ ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌లు, Nokia బేస్ స్టేషన్లకు సపోర్ట్ ఇవ్వడానికి నోకియాతో ఒప్పందం చేసుకుంది. అలాగే దేశంలో రేడియో యాక్సెస్ నెట్‌వర్క్ విస్తరణ కోసం జియో, ఎరిక్సన్ కంపెనీతో కూడా ఒప్పందం కుదుర్చుకుంది.

Next Story

Most Viewed