ప్రీమియం విభాగంలో కొత్త పోస్ట్ పెయిడ్ 'బ్లాక్ ప్లాన్' తీసుకొచ్చిన ఎయిర్‌టెల్!

by Disha Web Desk 7 |
ప్రీమియం విభాగంలో కొత్త పోస్ట్ పెయిడ్ బ్లాక్ ప్లాన్ తీసుకొచ్చిన ఎయిర్‌టెల్!
X

న్యూఢిల్లీ: దేశీయ దిగ్గజ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ ఇటీవల తన ప్రీమియం సర్వీసుల విభాగంలో రెండు పోస్ట్ పెయిడ్ ప్లాన్‌లను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా బ్లాక్ ప్లాన్‌లో భాగంగా రూ. 998తో కూడిన పోస్ట్ పెయిడ్ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్ ఎంచుకునే వారికి రెండు పోస్ట్ పెయిడ్ సర్వీసులతో పాటు ఎక్స్‌ట్రీమ్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు లభిస్తాయి. అంతేకాకుండా పలు ఓటీటీ సేవలు కూడా వినియోగించవచ్చు.

కొత్త ప్లాన్ ప్రకారం, రెండు పోస్ట్ పెయిడ్ సిమ్ కార్డులు, ఒక ఎక్స్‌ట్రీమ్ ఫైబర్ బ్రాడ్‌బ్యాంక్ లభిస్తాయి. పోస్ట్ పెయిడ్ ద్వారా అపరమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 మేసేజ్‌లు, నెలకు 105జీబీ అన్‌లిమిటెడ్ డేటా పొందవచ్చు. అంతేకాకుండా ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, ఇతర ఓటీటీ సేవలను ఉచితంగా అందుకోవచ్చు. ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ యాప్, హలో ట్యూన్స్, వింక్ మ్యూజిక్ సౌకర్యాలను వాడుకోవచ్చు.

అదేవిధంగా ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ద్వారా ల్యాండ్‌లైన్ సేవలు, 40ఎంబీపీఎస్ స్పీడ్‌తో కూడిన అన్‌లిమిటెడ్ డేటా, అపరిమిత ల్యాండ్‌లైన్ కాల్స్ సదుపాయాలను వినియోగించవచ్చు. బ్లాక్ ప్లాన్ ద్వారా వినియోగదారులు ప్రీమియం సేవలు పొందుతారని, ఒకే బిల్లు ద్వారా ప్రత్యేక కాల్ సెంటర్ సౌకర్యాలు, బై నౌ పే లేటర్, ఇంకా ఇతర ప్రయోజనాలు పొందవచ్చని కంపెనీ తెలిపింది. మొదటి నెల రోజులు ఉచిత సేవలు, ఉచిత ఇన్‌స్టాలేషన్, ఏడాది పోస్ట్‌పెయిడ్ బిల్లుపై నెలకు రూ. 100 రాయితీ లాంటి అనేక ప్రయోజనాలున్నాయని కంపెనీ పేర్కొంది.


Next Story