యాడ్స్‌లో వివరాలు స్పష్టంగా ఉండాలని కేంద్రం ఆదేశం!

by Disha Web Desk 17 |
యాడ్స్‌లో వివరాలు స్పష్టంగా ఉండాలని కేంద్రం ఆదేశం!
X

న్యూఢిల్లీ: తయారీదారులు, సర్వీస్ ప్రొవైడర్లు, ప్రకటన కర్తలు, ఏజెన్సీలు వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా యాడ్స్ లేకుండా చూడాలని ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ సోమవారం మాట్లాడుతూ.. కమర్షియల్ యాడ్స్ వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, వివరాలు స్పష్టంగా ఉండేలా చూడాలన్నారు. ముఖ్యంగా లింక్స్, హ్యాష్‌ట్యాగ్‌లతో నింపేసేలా ఉండొద్దని సోమవారం జరిగిన అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కార్యక్రమంలో చెప్పారు.

సోషల్ మీడియాల్లో యాడ్స్ ఇచ్చే సమయంలో బాధ్యతగా ఉండాలని, సోషల్ మీడియా సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లూయెన్సర్లు యాడ్ అందించే వారితో ఉన్న సంబంధాలను స్పష్టంగా పేర్కోనాల్సి ఉంటుందన్నారు. లేకపోతే వారి విశ్వసనీయత కోల్పోతారని ఆయన తెలిపారు. యాడ్స్‌లో ఇచ్చే వివరాలు కూడా లింక్, హ్యాష్‌ట్యాగ్‌ల రూపంలో కాకుండా వివరంగా ఉండాలని, ఫొటోల రూపంలో ఇచ్చే సమయంలో స్పష్టత కలిగి ఉండాలని పేర్కొన్నారు.

వీడియో రూపంలో యాడ్స్ ఇస్తే ఆడియోలోను, ఆడియోలో ఇస్తే వీడియోలోనూ వివరాలు చెప్పాలి. లైవ్‌స్ట్రీమ్‌లో కూడా యాడ్స్ వివరాలు ఉండాలని, వ్యాపారాలతో పాటు వినియోగదారుల ప్రయోజనాలు తమకు ముఖ్యమని భావించాలని రోహిత్ కుమార్ అన్నారు. వ్యాపారాలకు మద్దతు ఇవ్వడంతో పాటు వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడం మధ్య సమతుల్యతను పాటించడం చాలా కీలకమని ఆయన వెల్లడించారు.



Next Story

Most Viewed