అదానీ గ్రూపుపై వికీపీడియా మరో ఆరోపణ!

by Disha Web Desk 17 |
అదానీ గ్రూపుపై వికీపీడియా మరో ఆరోపణ!
X

న్యూఢిల్లీ: ఇప్పటికే హిండెన్‌బర్గ్ ఆరోపణలతో ప్రపంచ బిలీయనీర్ల జాబితాలో 25వ స్థానానికి పడిపోయిన అదానీకి మరో షాక్ తగిలింది. అదానీ గ్రూపునకు సంబంధించిన సమాచారాన్ని వికీపీడియాలో తారుమారు చేశారని తాజాగా కొత్త ఆరోపణలు వచ్చాయి. అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, కంపెనీలకు సంబంధించిన వివరాలను అనుకూలంగా ఎడిట్ చేశారని, వార్నింగ్‌లను తొలగించాలని వికీపీడియా ఆరోపించింది. అందుకోసం పెయిడ్ ఎడిటర్లను వాడుకున్నారని వెల్లడించింది.

తాజాగా వికీపీడియాకు చెందిన న్యూస్ పేపర్ ది సైన్‌పోస్ట్‌లో, అదానీ ఫ్యామిలీ, వారి వ్యాపారాలకు సంబంధించి పక్షపాతంతో కూడిన సమాచారం చేర్చారని తెలిపింది. 2007లో అదానీ గురించి ముక్కుసూటిగా కంటెంట్ రావడం మొదలవగా, అనంతరం 2012 నుంచి ఎడిటర్లు కంటెంట్‌ను మార్చారు. వార్నింగ్ సమాచారాన్ని తొలగించారు. అలా కంటెంట్‌ను ఎడిట్ చేసినవారిలో వికీపీడియా ఉద్యోగులు కూడా ఉన్నట్టు గుర్తించామని వివరించింది.

కంపెనీలకు చెందిన కంటెంట్ మార్పులు అదానీ గ్రూప్ ఐపీ అడ్రస్ నుంచే జరిగాయి. వికీపీడియా క్వాలిటీ టీమ్‌కు కూడా దొరక్కుండా ఈ వ్యవహారమంతా కొనసాగింది. వీటిని రివ్యూ చేసే తమ ఉద్యోగిని గుర్తించి, నిషేధం కూడా విధించామని వికీపీడియా పేర్కొంది.



Next Story

Most Viewed