పేటీఎం సీఈవో మెచ్చిన పాప.. మ్యూచ్‌వల్ ఫండ్స్ ‌పై చిన్నారి టాలెంట్‌కు ఫిదా

by Disha Web Desk 17 |
పేటీఎం సీఈవో మెచ్చిన పాప.. మ్యూచ్‌వల్ ఫండ్స్ ‌పై చిన్నారి టాలెంట్‌కు ఫిదా
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్య కాలంలో ప్రజలకు పెట్టుబడులపై ఆసక్తి క్రమంగా పెరుగుతుంది. టెక్నాలజీ డెవలప్ అయిన కొద్ది ఏ చిన్న సమాచారం అయినా ప్రపంచవ్యాప్తంగా అందరికి చేరుతుంది. పెట్టుబడులలో ముఖ్యంగా గుర్తుకు వచ్చేది అంటే మ్యూచ్‌వల్ ఫండ్స్ మాత్రమే.

దీనిలో రిస్క్ కొంచెం తక్కువగా ఉంటుంది. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ కంటే ఇది చాలా మేరకు బెటర్. కానీ చాలా మందికి మ్యూచ్‌వల్ ఫండ్స్ పట్ట అవగాహన లేకపోవడం వలన, వాటిలో ఉండే నష్ట భయాల గురించి ఆలోచించి పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రారు.

కానీ పెద్ద వాళ్ళకే అంతగా అర్థం కానీ మ్యూచ్‌వల్ ఫండ్స్ గురించి ఒక చిన్నపాప చక్కగా వివరించింది. ఇటీవల ట్విట్టర్‌లో ఏడేళ్ల బాలిక తాను దాచిపెట్టుకున్న డబ్బులను మ్యూచ్‌వల్ ఫండ్స్‌లో పెడుతున్నట్టు తెలిపింది.

అంతేకాకుండా మ్యూచువల్ ఫండ్స్‌లో ఎందుకు డబ్బులు పెట్టాలి, ఏ కంపెనీలు మంచివి అనే వివరాలను వివరించింది. దీనికి సంబంధించిన వీడియో ట్విట్టర్‌లో పాపులర్ అయింది. ఈ వీడియోను చూసిన పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ కూడా ''మ్యూచువల్ ఫండ్ సహీ హై''అంటూ ట్వీట్ చేశారు.



Next Story

Most Viewed